91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 26 Oct 2024 12:51:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OPPO A3x: రూ.9,999 ధరతో లాంచైన ఒప్పో ఏ3ఎక్స్ కొత్త వేరియంట్ https://www.91mobiles.com/telugu/oppo-a3x-4g-new-variant-launched-with-rs-9999-price/ https://www.91mobiles.com/telugu/oppo-a3x-4g-new-variant-launched-with-rs-9999-price/#respond Sat, 26 Oct 2024 12:51:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=14069 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొన్ని రోజుల క్రితం ఏ-సిరీస్ లో A3x అనే డివైజ్‌ని లాంచ్ చేసింది. OPPO A3x పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ ఫోన్ యొక్క కొత్త వేరియంట్‌ని కంపెనీ విడుదల చేసింది. ఈ వేరియంట్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వచ్చింది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. OPPO A3x 4G భారత మార్కెట్ […]

The post OPPO A3x: రూ.9,999 ధరతో లాంచైన ఒప్పో ఏ3ఎక్స్ కొత్త వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ
  • నెబులా రెడ్, ఓషన్ బ్లూ కలర్స్
  • స్నాప్‌డ్రాగన్ 6ఎస్ 4జీ జెన్ 1

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొన్ని రోజుల క్రితం ఏ-సిరీస్ లో A3x అనే డివైజ్‌ని లాంచ్ చేసింది. OPPO A3x పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ ఫోన్ యొక్క కొత్త వేరియంట్‌ని కంపెనీ విడుదల చేసింది. ఈ వేరియంట్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వచ్చింది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OPPO A3x 4G భారత మార్కెట్ ధర

OPPO A3x 4G స్మార్ట్‌ఫోన్ మొదట భారత్‌లో 4జిబి+64జిబి సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.8,999 గా పెట్టారు. ఇప్పుడు 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో కొత్త వేరియంట్‌ను కంపెనీ తీసుకొచ్చింది. ఈ ఫోన్ నెబులా రెడ్ మరియు ఓషన్ బ్లూ కలర్స్ లో కంపెనీ వెబ్‌సైట్‌పై లిస్ట్ అయ్యింది.

OPPO A3x 4G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO A3x 4G లో 6.67-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1604*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, ఎల్సీడీ ప్యానెల్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO A3x 4G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ 4జీ జెన్ 1 ఆక్టా-కోర్ చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 1.8 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 610 జీపీయూ ఇచ్చారు.

ర్యామ్, స్టోరేజీ: OPPO A3x 4G లో 4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఉన్నాయి. 4జిబి వర్చువల్ ర్యామ్‌ను ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 8జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: OPPO A3x 4G లో 8ఎంపి మెయిన్ కెమెరా ఉంది. దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఇచ్చారు. రియర్ ప్యానెల్ పై ఒక ఫ్లికర్ సెన్సర్ అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: OPPO A3x 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫ్లాష్ చార్జ్ టెక్నాలజీ అందించారు. ఈ ఫోన్ 30 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

సాఫ్ట్‌వేర్: OPPO A3x 4G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

కనెక్టివిటీ: OPPO A3x 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post OPPO A3x: రూ.9,999 ధరతో లాంచైన ఒప్పో ఏ3ఎక్స్ కొత్త వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-a3x-4g-new-variant-launched-with-rs-9999-price/feed/ 0
OnePlus Nord 4 పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-discount-offer-know-full-details/ https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-discount-offer-know-full-details/#respond Wed, 23 Oct 2024 15:18:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=14064 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus కి భారత్‌లో మంచి పేరుంది. ఈ బ్రాండ్ ఫోన్లకు కొనేందుకు మొబైల్ లవర్స్ ఆసక్తి చూపుతారు. వన్‌ప్లస్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి ఒక శుభవార్త వచ్చింది. కొన్ని రోజుల క్రితం లాంచైన OnePlus Nord 4 డిస్కౌంట్ పై లభిస్తోంది. రూ.5,000 వరకు కస్టమర్లకు ప్రయోజనం లభించనుంది. ఓసారి డిస్కౌంట్ ఆఫర్ వివరాలను తెలుసుకుందాం. OnePlus Nord 4 ఆఫర్ వివరాలు OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్‌పై రూ.2,000 ఇన్‌స్టంట్ […]

The post OnePlus Nord 4 పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OnePlus Nord 4 బ్యాంక్ డిస్కౌంట్
  • రూ.3,000 వరకు తాత్కాలిక తగ్గింపు
  • మొత్తం ప్రయోజనం రూ.5,000

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus కి భారత్‌లో మంచి పేరుంది. ఈ బ్రాండ్ ఫోన్లకు కొనేందుకు మొబైల్ లవర్స్ ఆసక్తి చూపుతారు. వన్‌ప్లస్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి ఒక శుభవార్త వచ్చింది. కొన్ని రోజుల క్రితం లాంచైన OnePlus Nord 4 డిస్కౌంట్ పై లభిస్తోంది. రూ.5,000 వరకు కస్టమర్లకు ప్రయోజనం లభించనుంది. ఓసారి డిస్కౌంట్ ఆఫర్ వివరాలను తెలుసుకుందాం.

OnePlus Nord 4 ఆఫర్ వివరాలు

  • OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్‌పై రూ.2,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే, కొన్ని ఎంపిక చేయబడిన బ్యాంక్ కార్డులపై, 9 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది.
  • ఇవే కాకుండా, రూ.3,000 వరకు తాత్కాలిక ధర తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. దీంతో ధర రూ.5,000 వరకు తగ్గుతుంది.
  • ప్రస్తుతం ఈ ఆఫర్లు వన్‌ప్లస్.ఇన్, అమెజాన్.ఇన్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్ మరియు రిలయన్స్ డిజిటల్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, క్రోమా, విజయ్ సేల్స్, పూర్వికా, సంగీతా మొబైల్స్, పై ఎలక్ట్రానిక్స్, బిగ్ సీ మొబైల్స్, లాట్ మొబైల్స్ తదితర స్టోర్స్ లలో అందుబాటులో ఉన్నాయి.

OnePlus Nord 4 ధర వివరాలు

  • OnePlus Nord 4 యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.29,999 గా ఉంది.
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.32,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది.
  • మెర్క్యూరియల్ సిల్వర్, ఒబ్సీడియన్ మిడ్నైట్ మరియు ఒయాసిస్ గ్రీన్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

OnePlus Nord 4 స్పెసిఫికేషన్స్

స్క్రీన్: OnePlus Nord 4 5G లో 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ ప్యానెల్, 6.74-ఇంచ్ డిస్ప్లే, అల్ట్రా హెచ్డీఆర్, 2150 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందించారు.

ప్రాసెసర్: ఈ వన్‌ప్లస్ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఈ చిప్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.8 గిగాహెర్ట్జ్.

సాఫ్ట్‌వేర్: OnePlus Nord 4 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 14.0 కస్టమ్ స్కిన్‌తో లాంచ్ అయ్యింది.

మెమొరీ: OnePlus Nord 4 5G డివైజ్ 8జిబి/12జిబి యూఎఫ్ఎస్ 4.0 ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 3.1/256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది.

బ్యాటరీ: OnePlus Nord 4 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: OnePlus Nord 4 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇంచ్చారు. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్+ఈఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని అల్ట్రావైడ్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

కనెక్టివిటీ: OnePlus Nord 4 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, అలర్ట్ స్లైడర్, యూఎస్బీ టైప్-సీ 2.0, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OnePlus Nord 4 5G తో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, నాయిస్ క్యాన్సలేషన్, ఇన్‌డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post OnePlus Nord 4 పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-discount-offer-know-full-details/feed/ 0
Realme GT 7 Pro: నవంబర్‌‌లో భారత్‌లో లాంచ్ అవుతోన్న రియల్మీ జీటీ 7 ప్రో https://www.91mobiles.com/telugu/realme-gt-7-pro-india-launch-november-2024-official/ https://www.91mobiles.com/telugu/realme-gt-7-pro-india-launch-november-2024-official/#respond Tue, 22 Oct 2024 05:18:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=14059 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో జీటీ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme GT 7 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ టైమ్‌లైన్ రివీల్ అయ్యింది. కంపెనీ టీజర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. టీజర్ ప్రకారం, ఈ ఫోన్ నవంబర్ నెలలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం. Realme GT 7 […]

The post Realme GT 7 Pro: నవంబర్‌‌లో భారత్‌లో లాంచ్ అవుతోన్న రియల్మీ జీటీ 7 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme GT 7 Pro విడుదల
  • స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్
  • వై-ఫై 7, 8కే వీడియో రికార్డింగ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో జీటీ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme GT 7 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ టైమ్‌లైన్ రివీల్ అయ్యింది. కంపెనీ టీజర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. టీజర్ ప్రకారం, ఈ ఫోన్ నవంబర్ నెలలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Realme GT 7 Pro ఇండియా లాంచ్

Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో లాంచ్ కానున్నట్లు కంపెనీ సోషల్ మీడియాలో టీజర్ ద్వారా వెల్లడించింది. అలాగే నవంబర్ నెలలో ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని కూడా తెలిపింది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ చిప్సెట్‌తో వస్తోన్న భారతదేశపు తొలి ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. అయితే డివైజ్ యొక్క లాంచ్ తేదీని రియల్మీ ఇంకా వెల్లడించలేదు.

ఇక స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ విషయానికి వస్తే, ఈ చిప్సెట్ 3 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. ఒరైన్ సీపీయూ స్ట్రక్చర్ కలిగి ఉంది. అడ్రెనో జీపీయూ, హెక్సాగన్ ఎన్‌పీయూ కలిగిన ఈ చిప్సెట్ ప్రపంచంలోనే వేగవంతమైన చిప్సెట్ అని రియల్మీ చెబుతోంది. ఈ ప్రాసెసర్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 4.32 గిగాహెర్ట్జ్. ఫోన్ పెర్ఫామెన్స్‌ను ఇది 45 శాతం మేర పెంచుతుంది. అలాగే ఈ చిప్ లో అడ్వాన్స్డ్ ఏఐ కేపబులిటీస్ కూడా ఉన్నాయి.

స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ చిప్సెట్ 320 మెగాపిక్సెల్స్ వరకు గల కెమెరాకు సపోర్ట్ చేస్తుంది. ఇది 8కే వీడియో రికార్డింగ్ చేయగలదు. ఈ చిప్సెట్ 24జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ, వై-ఫై 7, స్నాప్‌డ్రాగన్ ఎక్స్80 5జీ మోడెమ్-ఆర్ఎఫ్ సిస్టమ్, ఫాస్ట్ కనెక్ట్ 7300 వంటి ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.

Realme GT 7 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

స్క్రీన్: Realme GT 7 Pro లో శాంసంగ్ క్వాడ్ మైక్రో కర్వ్డ్ ఎల్టీపీవో డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

మెమొరీ: Realme GT 7 Pro డివైజ్ 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించనున్నారు.

సాఫ్ట్‌వేర్: Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ తో లాంచ్ అవుతుంది. 3 ఏళ్ళ పాటు ఓఎస్ మరియు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కెమెరా: Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్906 ప్రైమరీ కెమెరా, 50ఎంపి సోని ఐఎంఎక్స్882 పెరిస్కోప్ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.

బ్యాటరీ: Realme GT 7 Pro లో పవర్ బ్యాకప్ కోసం 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Realme GT 7 Pro: నవంబర్‌‌లో భారత్‌లో లాంచ్ అవుతోన్న రియల్మీ జీటీ 7 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-gt-7-pro-india-launch-november-2024-official/feed/ 0
Realme P1 Speed 5G: 12GB ర్యామ్, ఓఎల్ఈడీ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/realme-p1-speed-5g-launched-12gb-ram-oled-display/ https://www.91mobiles.com/telugu/realme-p1-speed-5g-launched-12gb-ram-oled-display/#respond Tue, 15 Oct 2024 14:35:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=14052 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో పీ1 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Realme P1 Speed 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్‌ని ప్రత్యేకించి గేమింగ్ లవర్స్ మరియు హెవీ యూజర్ల కోసం తీసుకొచ్చారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్, 12జిబి ర్యామ్, ఓఎల్ఈడీ స్క్రీన్, 256జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఓసారి ఈ […]

The post Realme P1 Speed 5G: 12GB ర్యామ్, ఓఎల్ఈడీ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Realme P1 Speed 5G విడుదల
  • 50ఎంపి ప్రైమరీ కెమెరా
  • డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5జీ చిప్సెట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో పీ1 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Realme P1 Speed 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్‌ని ప్రత్యేకించి గేమింగ్ లవర్స్ మరియు హెవీ యూజర్ల కోసం తీసుకొచ్చారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్, 12జిబి ర్యామ్, ఓఎల్ఈడీ స్క్రీన్, 256జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme P1 Speed 5G ధర మరియు లభ్యత

  • Realme P1 Speed 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.
  • 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.17,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.20,999 గా పెట్టారు.
  • లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఈ ఫోన్ పై రూ.2,000 డిస్కౌంట్ పొందవచ్చు. కంపెనీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ మరియు రిటైల్ స్టోర్స్ ద్వారా అక్టోబర్ 20వ తేదీ నుంచి రియల్మీ పీ2 స్పీడ్ 5జీ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

Realme P1 Speed 5G డిజైన్

Realme P1 Speed 5G స్మార్ట్‌ఫోన్ చూసేందుకు గత మోడల్ పీ1 మరియు పీ1 ప్రో మాదిరే ఉంది. బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, ఫ్లాట్ కార్నర్స్ ఉన్నాయి. ముందువైపు, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ బ్రష్డ్ బ్లూ మరియు టెక్షర్డ్ టైటానియమ్ కలర్స్ లో లభిస్తుంది.

Realme P1 Speed 5G డివైజ్ 161.7 మి.మీ పొడవు, 74.7 మి.మీ వెడల్పు, 7.6 మి.మీ మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది.

Realme P1 Speed 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme P1 Speed 5G లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ ఈస్పోర్ట్స్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ లోకల్ మరియు 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1080*2400 ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 92.65% స్క్రీన్ టు బాడీ రేషియో, 16.7 మిలియన్ కలర్స్, రెయిన్ వాటర్ టచ్ ఫీచర్ ఉన్నాయి.

చిప్సెట్: Realme P1 Speed 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5జీ చిప్సెట్ వాడారు. ఈ ప్రాసెసర్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్. ఈ చిప్సెట్ అంటుటు స్కోర్ 7,50,000+ గా నమోదైనట్లు కంపెనీ చెబుతోంది.

ర్యామ్, స్టోరేజీ: Realme P1 Speed 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. 14జిబి వరకు డైనమిక్ ర్యామ్ ఫీచర్ వల్లన యూజర్‌కి గరిష్టంగా 26జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Realme P1 Speed 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా (ఎఫ్/1.8 అపర్చర్), ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‌లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Realme P1 Speed 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Realme P1 Speed 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

కనెక్టివిటీ: Realme P1 Speed 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme P1 Speed 5G లో ఐపీ65 ప్రొటెక్షన్ ఉంది. దీని వల్లన నీరు మరియు దుమ్ము నుంచి ఫోన్‌కి రక్షణ లభిస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో జీటీ మోడ్ ఉంది.

The post Realme P1 Speed 5G: 12GB ర్యామ్, ఓఎల్ఈడీ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-p1-speed-5g-launched-12gb-ram-oled-display/feed/ 0
Tecno Camon 30S: 8GB ర్యామ్, 50MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన టెక్నో కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/tecno-camon-30s-globally-launched-8gb-ram-50mp-camera/ https://www.91mobiles.com/telugu/tecno-camon-30s-globally-launched-8gb-ram-50mp-camera/#respond Fri, 11 Oct 2024 16:08:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=14047 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno తాజాగా గ్లోబల్ మార్కెట్‌లో Camon 30S స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ త్వరలోనే భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లో కూడా విడుదల కానుంది. ఈ హ్యాండ్సెట్ లో వర్చువల్ టెక్నాలజీతో 16జిబి వరకు ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 50ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Tecno Camon 30S […]

The post Tecno Camon 30S: 8GB ర్యామ్, 50MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన టెక్నో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా Tecno Camon 30S విడుదల
  • 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno తాజాగా గ్లోబల్ మార్కెట్‌లో Camon 30S స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ త్వరలోనే భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లో కూడా విడుదల కానుంది. ఈ హ్యాండ్సెట్ లో వర్చువల్ టెక్నాలజీతో 16జిబి వరకు ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 50ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Tecno Camon 30S ధర, కలర్ ఆప్షన్స్

  • Tecno Camon 30S స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం పాకిస్తాన్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. 256జిబి వేరియంట్ ధర PKR 59,999 (సుమారు రూ.18,000) గా ఉంది.
  • Tecno Camon 30S డివైజ్ బ్లూ, నెబులా వయొలెట్, సెలెస్టియల్ బ్లాక్ మరియు డాన్ గోల్డ్ కలర్స్ లో లభిస్తుంది.
  • బ్లూ కలర్ వేరియంట్ కలర్ చేంజింగ్ టెక్నాలజీతో వచ్చింది. దీని బ్యాక్ ప్యానెల్‌పై సూర్యకాంతి పడినప్పుడు రంగు మారుతుంది.

Tecno Camon 30S స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Tecno Camon 30S స్మార్ట్‌ఫోన్‌లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,300 నిట్స్ వరకు హైబ్రైట్నెస్ మోడ్, 10-బిట్ ప్యానెల్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 100% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

చిప్సెట్: Tecno Camon 30S స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ100 చిప్సెట్ అందించారు.

ర్యామ్, స్టోరేజీ: Tecno Camon 30S 6జిబి+128జిబి, 8జిబి+128జిబి, మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది. దీంతో గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ యూజర్‌కి లభిస్తుంది.

కెమెరా: Tecno Camon 30S స్మార్ట్‌ఫోన్ లో 50ఎంపి 1/1.56″ సోని ఐఎంఎక్స్896 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్‌లో డ్యూయల్ ఫ్లాష్ కూడా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Tecno Camon 30S లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Tecno Camon 30S లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Tecno Camon 30S లో ఐపీ53 రేటింగ్, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Tecno Camon 30S: 8GB ర్యామ్, 50MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన టెక్నో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-camon-30s-globally-launched-8gb-ram-50mp-camera/feed/ 0
Vivo Y300 Plus 5G: రూ.23,999 ధరతో భారత్‌లో లాంచైన వివో కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/vivo-y300-plus-5g-launched-india-rs-23999-price/ https://www.91mobiles.com/telugu/vivo-y300-plus-5g-launched-india-rs-23999-price/#respond Thu, 10 Oct 2024 14:37:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=14042 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా భారతీయ మార్కెట్ లో వై-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y300 Plus 5G పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. 32ఎంపి సెల్ఫీ కెమెరా, 50ఎంపి రియర్ కెమెరా, 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ ఈ ఫోన్ లో ఉన్నాయి. రూ.23,999 ప్రారంభ ధరతో వచ్చిన ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు సేల్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. Vivo Y300 Plus […]

The post Vivo Y300 Plus 5G: రూ.23,999 ధరతో భారత్‌లో లాంచైన వివో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Vivo Y300 Plus విడుదల
  • 32ఎంపి సెల్ఫీ కెమెరా
  • నేటి నుంచి సేల్ ప్రారంభం

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా భారతీయ మార్కెట్ లో వై-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y300 Plus 5G పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. 32ఎంపి సెల్ఫీ కెమెరా, 50ఎంపి రియర్ కెమెరా, 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ ఈ ఫోన్ లో ఉన్నాయి. రూ.23,999 ప్రారంభ ధరతో వచ్చిన ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు సేల్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Vivo Y300 Plus ధర, సేల్ వివరాలు

Vivo Y300 Plus స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.23,999 గా నిర్ణయించారు. అక్టోబర్ 10వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభమైంది. రిటైల్ స్టోర్స్ మరియు సాధారణ మొబైల్ షాప్స్ లో కూడా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Vivo Y300 Plus 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y300 Plus 5G లో 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ (2400*1080 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y300 Plus 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Vivo Y300 Plus 5G స్మార్ట్‌ఫోన్ లో 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మెమొరీ కార్డ్ సాయంతో 1టిబి వరకు స్టోరేజీని పెంచుకునే వీలుంది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo Y300 Plus 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo Y300 Plus 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo Y300 Plus 5G లో భద్రత కోసం ఐపీ54 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ అందించారు. ఇది తేలికపాటి నీటి జల్లులు మరియు దుమ్ము నుంచి ఫోన్‌కి రక్షణ అందిస్తుంది.

The post Vivo Y300 Plus 5G: రూ.23,999 ధరతో భారత్‌లో లాంచైన వివో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-y300-plus-5g-launched-india-rs-23999-price/feed/ 0
Samsung Galaxy A16 5G: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న గెలాక్సీ ఏ16 5జీ స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a16-5g-launch-india-soon-know-specs/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a16-5g-launch-india-soon-know-specs/#respond Wed, 09 Oct 2024 15:29:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=14039 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఏ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A16 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. ఇంకా లాంచ్ తేదీ రివీల్ కాలేదు. కానీ, దీపావళికి ముందు ఫోన్ లాంచ్ అవుతుందని సమాచారం. అయితే ఈ ఫోన్ ఇప్పటికే గ్లోబల్‌గా లాంచ్ అయ్యింది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియన్ వేరియంట్ ప్రధాన స్పెసిఫికేషన్స్, ఫీచర్ల గురించి సమాచారం బయటకు వచ్చింది. […]

The post Samsung Galaxy A16 5G: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న గెలాక్సీ ఏ16 5జీ స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Galaxy A16 5G భారత్‌లో విడుదల
  • దీపావళికి ముందు లాంచ్ అయ్యే అవకాశం
  • 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఏ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A16 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. ఇంకా లాంచ్ తేదీ రివీల్ కాలేదు. కానీ, దీపావళికి ముందు ఫోన్ లాంచ్ అవుతుందని సమాచారం. అయితే ఈ ఫోన్ ఇప్పటికే గ్లోబల్‌గా లాంచ్ అయ్యింది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియన్ వేరియంట్ ప్రధాన స్పెసిఫికేషన్స్, ఫీచర్ల గురించి సమాచారం బయటకు వచ్చింది. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

Samsung Galaxy A16 5G లాంచ్ ఎప్పుడు?

Samsung Galaxy A16 5G త్వరలో భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతుందని శాంసంగ్ సంస్థ అఫీషియల్‌గా వెల్లడించింది. కొన్ని రోజుల్లో లాంచ్ తేదీ రివీల్ అవుతుంది. దీపావళి పండుగకి ముందే ఈ ఫోన్‌ని శాంసంగ్ సేల్‌కి తీసుకొచ్చే అవకాశం ఉంది.

Samsung Galaxy A16 5G స్టోరేజీ, కలర్స్

Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీతో రానుంది. మైక్రోఎస్డీ కార్డ్ ఫెసిలిటీ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది. కలర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ గోల్డ్, లైట్ గ్రీన్, మరియు బ్లూ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది.

Samsung Galaxy A16 5G ధర శ్రేణి (అంచనా)

Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ ధర గ్లోబల్ మార్కెట్ లో 249 యూరోలుగా ఉంది. భారతీయ కరెన్సీ ప్రకారం, దీన్ని రూ.22,000 గా చెప్పవచ్చు. అయితే, భారత మార్కెట్ ధరను ఇంకా రివీల్ చేయలేదు. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.20,000 లోపు ఉండవచ్చని భావించవచ్చు.

Samsung Galaxy A16 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A16 5G లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ చిప్సెట్ తో లాంచ్ కానుంది. డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఈ ఫోన్ లో ఉండే అవకాశం ఉంది. గ్లోబల్ వేరియంట్ ఎగ్జినోస్ 1330 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1.5టిబి వరకు పెంచుకోవచ్చు. 4జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా యూజర్‌కి గరిష్టంగా 8జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరాలతో వస్తోంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A16 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy A16 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, వై-ఫై 5, వై-ఫై డైరెక్ట్, ఐపీ54 రేటింగ్ ఉంటాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది.

The post Samsung Galaxy A16 5G: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న గెలాక్సీ ఏ16 5జీ స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a16-5g-launch-india-soon-know-specs/feed/ 0
itel Flip One: భారత్‌లో లాంచైన ఐటెల్ ఫ్లిప్ వన్, తక్కువ ధరలో ఫోల్డబుల్ ఫోన్ https://www.91mobiles.com/telugu/itel-flip-one-launched-india-know-full-details/ https://www.91mobiles.com/telugu/itel-flip-one-launched-india-know-full-details/#respond Wed, 09 Oct 2024 13:07:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=14035 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ itel తాజాగా భారతీయ మార్కెట్‌లో itel Flip One అనే ఫోల్డబుల్ ఫీచర్ ఫోన్‌ని లాంచ్ చేసింది. తక్కువ ధరలో ఫ్లిప్ ఫోన్ కొనాలని భావించే వారికి ఇది సరైన ఎంపిక అవ్వవచ్చు. అయితే ఇది స్మార్ట్‌ఫోన్ కాదు, ఫీచర్ ఫోన్ అనే సంగతి గుర్తుంచుకోవాలి. సరే, ఓసారి ఐటెల్ ఫ్లిప్ వన్ ఫీచర్ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. itel […]

The post itel Flip One: భారత్‌లో లాంచైన ఐటెల్ ఫ్లిప్ వన్, తక్కువ ధరలో ఫోల్డబుల్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన itel Flip One
  • ఈ ఫీచర్ ఫోన్ ధర రూ.2,499
  • రిటైల్ స్టోర్స్ ద్వారా సేల్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ itel తాజాగా భారతీయ మార్కెట్‌లో itel Flip One అనే ఫోల్డబుల్ ఫీచర్ ఫోన్‌ని లాంచ్ చేసింది. తక్కువ ధరలో ఫ్లిప్ ఫోన్ కొనాలని భావించే వారికి ఇది సరైన ఎంపిక అవ్వవచ్చు. అయితే ఇది స్మార్ట్‌ఫోన్ కాదు, ఫీచర్ ఫోన్ అనే సంగతి గుర్తుంచుకోవాలి. సరే, ఓసారి ఐటెల్ ఫ్లిప్ వన్ ఫీచర్ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

itel Flip One ధర, కలర్స్, లభ్యత

itel Flip One ఫీచర్ ఫోన్ ధరను రూ.2,499 గా నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ స్టోర్స్ లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. లైట్ బ్లూ, బ్లాక్ మరియు ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

సాధారణంగా అందించే 12 నెలల వ్యారంటీ కాకుండా, మరొక నెల అదనపు వ్యారంటీని ఐటెల్ ఆఫర్ చేస్తోంది.

itel Flip One ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఐటెల్ ఫ్లిప్ వన్ స్లీక్ డిజైన్ మరియు వన్-హ్యాండ్ యూసేజ్ తో వచ్చింది. గ్లాస్ కీప్యాడ్ తో రావడం వల్లన ప్రీమియమ్ లుక్ తో కనిపిస్తుంది. బ్యాక్ ప్యానెల్ లెదర్ ఫినిష్ తో ఉంది.

డిస్ప్లే: itel Flip One లో 2.4-ఇంచ్ ఒవీజీఏ స్క్రీన్ ఇచ్చారు. ఇది క్రిస్టల్ క్లియర్ క్లారిటీని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

బ్యాటరీ: itel Flip One లో పవర్ బ్యాకప్ కోసం 1200 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. సూపర్ బ్యాటరీ మోడ్‌లో ఈ ఫ్లిప్ వన్ డివైజ్ 7 రోజుల వరకు బ్యాకప్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

ఇతర ఫీచర్లు: ఈ ఫోన్ కింగ్ వాయిస్ ఆన్-ద-గో వాయిస్ అసిస్టెన్స్ సపోర్ట్ మరియు బ్లూటూత్ కాలర్ ఫీచర్ తో రావడం వల్లన ఏ స్మార్ట్‌ఫోన్‌కైనా కనెక్ట్ అవ్వొచ్చు. దీంతో ఫీచర్ ఫోన్ నుంచి కాల్స్‌ను రిసీవ్ చేసుకోవచ్చు.

itel Flip One ఫీచర్ ఫోన్ 13 ప్రాంతీయ భాషల సపోర్ట్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, వీజీఏ కెమెరా ఉన్నాయి.

The post itel Flip One: భారత్‌లో లాంచైన ఐటెల్ ఫ్లిప్ వన్, తక్కువ ధరలో ఫోల్డబుల్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/itel-flip-one-launched-india-know-full-details/feed/ 0
Realme P1 Speed 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/realme-p1-speed-5g-india-launch-date-announced-know-full-details/ https://www.91mobiles.com/telugu/realme-p1-speed-5g-india-launch-date-announced-know-full-details/#respond Wed, 09 Oct 2024 08:02:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=14027 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో పీ1 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme P1 Speed 5G పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. అక్టోబర్ 15వ తేదీన రియల్మీ పీ1 స్పీడ్ 5జీ ఫోన్ లాంచ్ అవ్వనుంది. మీడియాటెక్ చిప్సెట్ తో వస్తోన్న ఈ ఫోన్ యొక్క లాంచ్ వివరాలు మరియు స్పెసిఫికేషన్స్ గురించి […]

The post Realme P1 Speed 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme P1 Speed 5G విడుదల
  • అక్టోబర్ 15న భారత్ లో లాంచ్
  • మీడియాటెక్ చిప్సెట్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో పీ1 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme P1 Speed 5G పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. అక్టోబర్ 15వ తేదీన రియల్మీ పీ1 స్పీడ్ 5జీ ఫోన్ లాంచ్ అవ్వనుంది. మీడియాటెక్ చిప్సెట్ తో వస్తోన్న ఈ ఫోన్ యొక్క లాంచ్ వివరాలు మరియు స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

Realme P1 Speed 5G లాంచ్ తేదీ

Realme P1 Speed 5G స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 15వ తేదీన లాంచ్ కానుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్మీ ఇండియా ఈ-స్టోర్ ద్వారా సేల్‌కి వస్తుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైన చిప్సెట్.

త్వరలో రాబోవు ఈ ఫోన్ అంటుటు పై 7,50,000 పాయింట్లకు పైగా స్కోర్ చేసినట్లు రియల్మీ చెబుతోంది. ఈ చిప్సెట్ లో నాలుగు కార్టెక్స్ ఏ78 కోర్స్, నాలుగు కార్టెక్స్ ఏ55 కోర్స్ మరియు మాలి జీ615 ఎంపీ2 జీపీయూ ఉన్నాయి.

తమ ఫోన్ గేమింగ్, స్ట్రీమింగ్, మల్టీటాస్కింగ్ ఇలా దేన్నైనా ఈజీగా హ్యాండిల్ చేయగలదని రియల్మీ అంటోంది.

ఇక, రియల్మీ షేర్ చేసిన టీజర్ లో కెమెరా మాడ్యూల్ హైలైట్ చేయబడింది. రియల్మీ పీ1 5జీ మాదిరిగానే బ్యాక్ ప్యానెల్ పై నీలం రంగులో టెక్షర్డ్ డిజైన్ ఉంది.

కెమెరా మాడ్యూల్ లో రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. ఇంకా ఈ ఫోన్‌లో అమోలెడ్ స్క్రీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.

త్వరలో Realme P1 Speed 5G కి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడవ్వనున్నాయి.

Realme P1 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Realme P1 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme P1 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. దీని హై క్లాక్ స్పీడ్ 2.6GHz. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ68 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Realme P1 5G డివైజ్ లో 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. ఈ ఫోన్ లో యూఎఫ్ఎస్3.1 స్టోరేజీ, ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ టెక్నాలజీని అందించారు.

ఓఎస్: Realme P1 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్‌కి 4 ఏళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

కెమెరా: Realme P1 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Realme P1 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో ఓటీజీ రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.

కనెక్టివిటీ: Realme P1 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, 5GHz వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 9 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Realme P1 5G డివైజ్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఐపీ54 రేటింగ్, 3డీ వీసీ కూలింగ్ సిస్టమ్, మినీ క్యాప్సూల్ 2.0, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Realme P1 Speed 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-p1-speed-5g-india-launch-date-announced-know-full-details/feed/ 0
Lava Agni 3 5G ఫస్ట్ సేల్ ప్రారంభం, ధర, ఆఫర్లు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-first-sale-begins-know-price-and-offers/ https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-first-sale-begins-know-price-and-offers/#respond Wed, 09 Oct 2024 06:13:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=14023 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava ఇటీవలె అగ్ని సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Lava Agni 3 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. డ్యూయల్ డిస్ప్లేతో రావడం ఈ ఫోన్ ప్రత్యేకత. నేటి నుంచి ఈ ఫోన్ యొక్క అఫీషియల్ సేల్ మొదలైంది. మరి, లావా అగ్ని 3 5జీ ఫోన్ ధర, ఆఫర్లు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా? Lava Agni 3 5G […]

The post Lava Agni 3 5G ఫస్ట్ సేల్ ప్రారంభం, ధర, ఆఫర్లు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇటీవలె లాంచైన Lava Agni 3 5G
  • నేటి నుంచి అమెజాన్ లో సేల్
  • ప్రారంభ ధర రూ.20,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava ఇటీవలె అగ్ని సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Lava Agni 3 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. డ్యూయల్ డిస్ప్లేతో రావడం ఈ ఫోన్ ప్రత్యేకత. నేటి నుంచి ఈ ఫోన్ యొక్క అఫీషియల్ సేల్ మొదలైంది. మరి, లావా అగ్ని 3 5జీ ఫోన్ ధర, ఆఫర్లు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా?

Lava Agni 3 5G ఆఫర్లు మరియు ధర

Lava Agni 3 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో రూ.20,999 ధరతో లాంచ్ అయ్యింది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ రూ.20,999 చార్జర్ లేకుండా విక్రయించబడనుంది. చార్జర్ తో కావాలంటే రూ.22,999 చెల్లించాలి. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర చార్జర్ తో రూ.24,999 గా ఉంది.

ఆఫర్ల విషయానికి వస్తే, బ్యాంక్ ఆఫర్ తో బేస్ వేరియంట్ పై చార్జర్ లేకుండా రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఇతర వేరియంట్స్ పై చార్జర్‌తో వరుసగా రూ.2,000 మరియు రూ.2,500 డిస్కౌంట్ పొందవచ్చు. ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్స్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది.

Lava Agni 3 5G స్మార్ట్‌ఫోన్ హీదర్ గ్లాస్ మరియు ప్రిస్టిన్ గ్లాస్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఆఫర్ ధర

  • 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ: రూ.19,999 (చార్జర్ లేకుండా)
  • 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ: రూ.20,999 (చార్జర్‌తో)
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ: రూ.22,499

ఈఎంఐ మరియు ఇతర ఆఫర్లు

  • మీరు గనుక, లావా అగ్ని 3 5జీ ఫోన్‌ని ఈఎంఐ ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. 3 నుంచి 6 నెలల కాలపరిమితితో ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
  • ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో భాగంగా, మీరు రూ.23,000 వరకు పూర్తి డిస్కౌంట్ పొందవచ్చు. అయితే, మీ పాత ఫోన్ స్థితిని బట్టి ఈ విలువ ఆధారపడి ఉంటుంది.
  • మీరు అమెజాన్ ప్రైమ్ కస్టమర్ అయి ఉండి, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడుతున్నట్లయితే, మీకు 5 శాతం అదనపు క్యాష్‌బ్యాక్ వస్తుంది.

లావా అగ్ని 3 5జీ ఫోన్‌ని ఎక్కడ కొనాలి?

Lava Agni 3 5G స్మార్ట్‌ఫోన్‌ని అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోండి. ఇంకా ఈ ఫోన్ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ లో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది.

అమెజాన్ లింక్

Lava Agni 3 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Lava Agni 3 5G లో 6.78-ఇంచ్ 1.5కే 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.74-ఇంచ్ అమోలెడ్ రియర్ స్క్రీన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Lava Agni 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ చిప్సెట్ వాడారు. ఇది అద్భుతమైన అనుభూతిని అందించేందుకు బాగా సరిపోతుంది.

ర్యామ్, స్టోరేజీ: Lava Agni 3 5G డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది.

కెమెరా: Lava Agni 3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్+ఈఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి 3ఎక్స్ ఓఐఎస్+ఈఐఎస్ టెలీఫోటో కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఈఐఎస్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Lava Agni 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Lava Agni 3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది. రెండు మేజర్ ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: Lava Agni 3 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6ఈ, 14 5జీ బ్యాండ్స్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, డాల్బీ అట్మాస్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్, నావిక్ జీపీఎస్ సిస్టమ్, ఐపీ64 రేటింగ్ ఉన్నాయి.

The post Lava Agni 3 5G ఫస్ట్ సేల్ ప్రారంభం, ధర, ఆఫర్లు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-first-sale-begins-know-price-and-offers/feed/ 0