Motorola: Geekbench పై Snapdragon చిప్సెట్‌తో లిస్టైన Moto G 5G (2024)

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Moto G 5G (2024)
  • గీక్‌బెంచ్ పై లిస్టైన డివైజ్
  • 4 జెన్ 1 చిప్సెట్ తో వచ్చే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో జీ-సిరీస్ లో ఒక ఫోన్ లాంచ్ చేయనుంది. Moto G 5G (2024) పేరుతో మార్కెట్ లోకి ఈ డివైజ్ రానుంది. గత మోడల్ Moto G 5G (2023) కి ఇది సక్సెసర్ గా వస్తోంది. ఈ ఫోన్ తాజాగా గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Moto G 5G (2024) యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Moto G 5G (2024) గీక్‌బెంచ్ లిస్టింగ్

  • Moto G 5G (2024) డివైజ్ యొక్క మోడల్ నంబర్ గీక్‌బెంచ్ ద్వారా రివీల్ కాలేదు.
  • Moto G 5G (2024) సింగిల్ కోర్ టెస్ట్ లో 842 పాయింట్లు, మల్టీ-కోర్ట్ టెస్ట్ లో 1,692 పాయింట్లు స్కోర్ చేసింది.
  • Fogo అనే కోడ్ నేమ్ గల మదర్‌బోర్డ్ లిస్టింగ్ పై కనిపించింది.
  • గ్రాఫిక్స్ కోసం Moto G 5G (2024) లో అడ్రెనో 619 జీపీయూ వాడినట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • Moto G 5G (2024) డివైజ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • ఇంకా లిస్టింగ్ పై Moto G 5G (2024) ఫోన్ 4జిబి ర్యామ్ తో లిస్ట్ అయ్యింది.
  • గీక్‌బెంచ్ పై Moto G 5G (2024) డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.

Moto G 5G (2023) స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G 5G (2023) స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
  • చిప్సెట్: Moto G 5G (2023) లో ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 480+ ప్రాసెసర్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: 4జిబి ర్యామ్, హ్యాండ్సెట్ 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Moto G 5G (2023) లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. 8ఎంపి ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్ లో అందించారు.
  • బ్యాటరీ: పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: డాల్బి అట్మాస్, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ, 5జీ కనెక్టివిటీ ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
Previous articleSamsung: MIL-STD-812H రేటింగ్‌తో లాంచైన Samsung Galaxy XCover7
Next articleAndroid OS, 4G LTE తో లాంచైన Fire-Boltt Dream స్మార్ట్‌వాచ్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.