హైలైట్స్:
- భారత్ లో ప్రీ-ఆర్డర్స్ కి అందుబాటులో ఉన్న గూగుల్ పిక్సెల్ 6ఏ
- గూగుల్ టెన్సర్ చిప్, 12ఎంపి డ్యూయల్ రియర్ కెమెరాస్, 4,308 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ పొందనున్న గూగుల్ పిక్సెల్ 6ఏ ఫోన్
మూడేళ్ళ తర్వాత, చివరకు గూగుల్ తన కొత్త పిక్సెల్ ఫోన్ పిక్సెల్ 6ఏ ని భారత్ లో లాంచ్ చేసింది. నేటి నుంచి పిక్సెల్ 6ఏ ప్రీ-ఆర్డర్స్ కి అందుబాటులో ఉంటుంది. గూగుల్ ఐ/ఓ ఈవెంట్ లో ప్రకటింపబడిన పిక్సెల్ 6ఏ, గూగుల్ యొక్క సొంత చిప్సెట్ టెన్సర్ ప్రాసెసర్ తో వస్తోంది. దీనికి జతగా టైటన్ ఎమ్2 సెక్యూరిటీ చిప్ కూడా ఉండనుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ తో వస్తోంది పిక్సెల్ 6ఏ. అలాగే మూడు నెలల పాటు యూట్యూబ్ ప్రీమియమ్ ఉచిత సబ్ స్క్రిప్షన్, 100జిబి గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజీని పిక్సెల్ 6ఏ కొనుగోలుదారులకు గూగుల్ అందిస్తోంది.
భారత్ లో Google Pixel 6a ధర, అమ్మకాలు మొదలయ్యే తేదీ
గూగుల్ పిక్సెల్ 6ఏ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ కలిగిన ఒకే ఒక్క వేరియంట్ లో లభ్యం కానుంది. ఇక ఈ వేరియంట్ ధర రూ.39,999. చాక్, చార్కోల్ అనే రెండు రంగుల ఆప్షన్స్ లో గూగుల్ పిక్సెల్ 6ఏ లభించనుంది. నేటి నుంచి మీరు పిక్సెల్ 6ఏ ఫోన్ ని ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక జులై 28 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
ఈ ధరలో వస్తున్న గూగుల్ పిక్సెల్ 6ఏ, నథింగ్ ఫోన్ (1), వన్ ప్లస్ 10ఆర్ లతో పోటీపడనుంది. ఈ రెండు డివైజెస్ కూడా రూ.40,000 ధర పలుకుతున్నాయి. మీకు ఆసక్తి ఉంటే ఇక్కడ నథింగ్ ఫోన్ (1) వర్సెస్ గూగుల్ పిక్సెల్ 6ఏ విశ్లేషణను చూడండి.
Google Pixel 6a స్పెసిఫికేషన్స్
గూగుల్ పిక్సెల్ 6ఏ ఫోన్లో గూగుల్ సొంతంగా తయారు చేసిన టెన్సర్ చిప్సెట్ ను వాడారు. 6జిబి ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ని ఈ ఫోన్ కలిగి ఉంది. దీనిలో మెమొరీని పెంచుకునే వీలు లేదు. అయితే, మీకు 100జిబి గూగుల్ వన్ స్టోరేజీ ఉచితంగా లభిస్తుంది. సెక్యూరిటీ కోసం పిక్సెల్ 6ఏ లో టైటన్ ఎమ్2 చిప్ ను అమర్చారు.
6.1 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ ప్యానెల్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 ఆస్పెక్ట్ రేషియో, హెచ్డీఆర్, 429 పీపీఐ, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే (నౌ ప్లేయింగ్ తో పాటు) ఈ ఫోన్లో ఉన్నాయి. ఓఎల్ఈడీ ప్యానెల్ రక్షణకై కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ను పిక్సెల్ 6ఏ లో అందిస్తున్నారు.
Google Pixel 6a స్పెసిఫికేషన్స్
- 6.1 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
- గూగుల్ టెన్సర్ చిప్సెట్
- 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ
- 12.2+12 ఎంపి డ్యూయల్ కెమెరాలు
- 8ఎంపి సెల్ఫీ కెమెరా
- 4,306ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్
ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లో 8ఎంపి కెమెరాను అందించారు. ఇక వెనుకవైపు రెండు కెమెరాలను అమర్చారు. వీటిలో ఒకటి 12.2 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా కాగా, రెండోది 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్. ఇక పిక్సెల్ 6ఏ బ్యాటరీ వివరాలను గురించి తెలుసుకుందాం. పిక్సెల్ 6ఏ లో 4,306ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కలిగి ఉంది.
పిక్సెల్ 6ఏ ఐపీ67 ప్రొటెక్షన్ ఉండటం వల్లన, కొంతవరకు వాటర్ మరియు డస్ట్ ని తట్టుకుని నిలబడగలదు. ఇక ఫోన్ ఔట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 12 తో వస్తుంది. అలాగే పిక్సెల్ 6ఏ ఐదేళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ను పొందనుంది. ఇక భద్రత కోసం పిక్సెల్ 6ఏ లో అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను అందించారు.