హైలైట్స్
- 2023 ప్రథమార్థంలో లాంచ్ కానున్న Google Pixel Fold
- శాంసంగ్ తయారు చేసిన యూటీజీ డిస్ప్లే తో రానున్న Pixel Fold
- గత కొన్నేళ్ళుగా Pixel Fold పై పని చేస్తున్న గూగుల్ కంపెనీ
Google కంపెనీ ఇటీవలె గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Pixel 7, Pixel 7 Pro మోడల్స్ ఉన్నాయి. వీటితో పాటు గూగుల్ పిక్సెల్ వాచ్ కూడా లాంచ్ అయ్యింది. ఇక తొలిసారిగా కంపెనీ, పిక్సెల్ ట్యాబ్లెట్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు 2023 ప్రథమార్థంలో Pixel Fold ఫోన్ ని తీసుకురావాలని గూగుల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
డిస్ప్లే అనలిస్ట్ రాస్ యంగ్ ప్రకారం, ప్రస్తుతం గూగుల్ Pixel Fold పై పని చేస్తున్నట్లు సమాచారం. అలాగే 2023 మొదటి త్రైమాసికంలో ఈ ఫోన్ ని గూగుల్ లాంచ్ చేయనుందని రాస్ యంగ్ చెప్పారు. అంటే వచ్చే ఏడాది మార్చి కల్లా ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది.
Pixel Fold క్యాన్సిల్ అయ్యిందా అనే యూజర్ ప్రశ్నకు బదులిచ్చిన యంగ్, 2023 జనవరి నుంచి ప్యానెల్ షిప్‌మెంట్స్ మొదలవుతాయని తాను విన్నట్లు తెలిపారు. యూఎస్ఏ లోకి 2023 స్ప్రింగ్ సీజన్ లో ప్రవేశిస్తుందని యంగ్ చెప్పారు.
పాస్ పోర్ట్ అనే కోడ్ నేమ్ తో కనిపించిన Pixel Fold ఈ ఏడాదే లాంచ్ అవుతుందని ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాజ్ తెలిపాడు. అయితే గూగుల్ నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు. రీసెంట్ గా జరిగిన గూగుల్ ఈవెంట్ లో పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో లాంచ్ చేసిన గూగుల్, Pixel Fold గురించి ఏమీ మాట్లాడలేదు.
ఆగస్టు నెలలో ట్రేడ్ మార్క్ మరియు ఐపీవో లిస్టింగ్ పై Pixel Fold కనిపించింది. ఆ డిజైన్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ లాగా ఉంది. దీన్ని బట్టి గూగుల్ Pixel Fold పై పని చేస్తున్నట్లు స్పష్టమైంది.
ఈ ఏడాది మొదట్లో మరో టిప్‌స్టర్ జాన్ ప్రాసర్, గూగుల్ Pixel Fold నిజమేనని ట్వీట్ చేశారు. తర్వాత రాస్ యంగ్ కూడా అదే విషయాన్ని తెలిపారు. ఎన్నో కంపెనీలు ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేయనున్నాయని, అందులో గూగుల్ కూడా ఒకటి అని రాస్ తెలిపారు.
అయితే గూగుల్ Pixel Fold ఏయే స్పెసిఫికేషన్లతో వస్తుందో ఇంత వరకు తెలియదు. అయితే, గూగుల్ తన ఫోల్డ్ డివైజ్ లో శాంసంగ్ తయారు చేసిన అల్ట్రా-తిన్ గ్లాస్ (యూటీజీ) ని వాడబోతున్నట్లు సమాచారం. గత కొన్నేళ్ళుగా గూగుల్ కంపెనీ, Pixel Fold పై పని చేస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్ లో శాంసంగ్ కంపెనీ ఫోల్డబుల్ ఫోన్స్ సెగ్మెంట్ లో ఆధిపత్యం చెలాయిస్తోంది. అలాగే శాంసంగ్ ఫోల్డబుల్ డివైజెస్ కి డిమాండ్ కూడా బాగానే ఉంది. ఇటీవలె మరో కంపెనీ వివో కూడా ఫోల్డబుల్ డివైజ్ ని లాంచ్ చేసింది. మరి గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ ఫోన్ ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.











