బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ Lava Yuva Pro ని లాంచ్ చేసిన LAVA

హైలైట్స్

  • భారత్ లో లాంచ్ అయిన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ Lava Yuva Pro
  • 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ తో లాంచ్ అయిన Lava Yuva Pro
  • భారత్ లో Lava Yuva Pro స్మార్ట్ ఫోన్ ధర రూ.7,799

స్వదేశీ మొబైల్ ఫోన్ కంపెనీ LAVA ఇటీవలె తక్కువ ధర కలిగిన 5జీ స్మార్ట్ ఫోన్ Lava Blaze 5G ని భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. Lava Blaze 5G ధర సుమారు రూ.10,000. ఇప్పుడు ఈ కంపెనీ బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ స్మార్ట్ ఫోన్ Lava Yuva Pro ని ఇండియాలో లాంచ్ చేసింది. Lava Yuva Pro యొక్క ధర, స్పెసిఫికేషన్స్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Lava Yuva Pro ధర

భారత మార్కెట్ లో కేవలం సింగల్ వేరియంట్ లోనే లాంచ్ అయిన Lava Yuva Pro ధర రూ.7,799 గా ఉంది. 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ తో ఈ ఫోన్ వచ్చింది. Lava Yuva Pro స్మార్ట్ ఫోన్ ని మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, మెటాలిక్ గ్రే కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు. 100 రోజుల ఫ్రీ స్క్రీన్ రిప్లేస్మెంట్ సౌకర్యం కూడా ఉంది.

Lava Yuva Pro స్పెసిఫికేషన్స్

Lava Yuva Pro లో 6.51-ఇంచ్ వాటర్ డ్రాప్ డిస్ప్లే, ఐపీఎస్ ప్యానెల్, 720*1600 పిక్సెల్స్ హెచ్డీ+ రెజుల్యూషన్, 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి. డిస్ప్లే భద్రత కోసం గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అందించారు. మీడియాటెక్ హీలియో ప్రాసెసర్ ని ఇందులో అమర్చారు. ఇక 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ ఇందులో ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజీని 512జిబి వరకు పెంచుకునే అవకాశం ఉంది.

Lava Yuva Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఈ డివైజ్ 37 గంటల టాక్ టైమ్, 320 గంటల స్టాండ్ బై టైమ్ ఇస్తుందని లావా చెబుతోంది. యూఎస్బీ టైప్ సీ పోర్ట్ ద్వారా డివైజ్ ని చార్జ్ చేయవచ్చు. ఇకపోతే ఇందులో 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ని అందించారు.

యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఓటీజీ పెన్ డ్రైవ్ సపోర్ట్ కూడా కలిగి ఉంది. అలాగే Lava Yuva Pro లో 4జీ కనెక్టివిటీ, వై-ఫై 802.11 b/g/n/ac, జీపీఆర్ఎస్ సపోర్ట్ ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంది.

ఇప్పుడు Lava Yuva Pro యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Lava Yuva Pro లో 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, రెండు ఏఐ లెన్సెస్ తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం Lava Yuva Pro లో ముందు వైపున 8 మెగా పిక్సెల్ కెమెరా అమర్చారు. హెచ్డీఆర్, పొట్రెయిట్, బ్యూటీ, నైట్, జీఐఎఫ్, టైమ్-ల్యాప్స్ ఫోటోగ్రఫీ వంటి కెమెరా ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

Previous article2023 మార్చిలో లాంచ్ కానున్న Google Pixel Fold
Next articleఅక్టోబర్ 14 న లాంచ్ కానున్న Redmi A1+ స్మార్ట్ ఫోన్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.