
Nokia బ్రాండ్ లైసెన్స్ హోల్డర్, హెఎండి స్మార్ట్‌ఫోన్ల తయారీదారు అయిన HMD Global ఐపీఎల్ జరుగుతోన్న సందర్భంగా HMD Arrow అనే స్మార్ట్‌ఫోన్‌ని టీజ్ చేసింది. ఇక అప్పటి నుంచి ఈ ఫోన్ లాంచ్ కోసం యూజర్లు వేచి చూస్తున్నారు. అయితే నేడు హెచ్ఎండి నుంచి ఊహించని ప్రకటన వచ్చింది. HMD Arrow డివైజ్ భారత్ లో లాంచ్ కాబోదని హెచ్ఎండి బ్రాండ్ వెల్లడించింది. అంటే వేరే పేరుతో లాంచ్ అవుతుందని సదరు సంస్థ తెలిపింది. మరి పేరు మార్పుకి గల కారణం ఏంటో తెలుసుకుందామా?
HMD Arrow పేరు మార్పు వెనుక కారణం
HMD బ్రాండ్ నేడు సోషల్ మీడియా వేదిక X పై ఓ కీలక ప్రకటన చేసింది. అసలైతే, HMD Arrow ఫోన్ లాంచ్ చేయాల్సి ఉంది. కానీ, కొన్ని న్యాయపరమైన కారణాల వల్లన Arrow అనే పదాన్ని వాడే వీలు లేనందున, HMD Arrow పేరుని మార్చబోతున్నట్లు హెచ్ఎండి సంస్థ తెలిపింది. త్వరలోనే ఈ ఫోన్ యొక్క కొత్త పేరును కంపెనీ ప్రకటించనుంది.
Thank you for your amazing response to our #HMDNameOurFirstSmartphone contest! 🌟 While we can’t use the name “Arrow” due to legal reasons, all five winners will receive their prizes after the launch.
Stay tuned for the final name reveal!#HMD #HumanMobileDevices pic.twitter.com/QmeqoEmWTZ
— HMD India (@HMDdevicesIN) July 7, 2024
HMD Vibe స్పెసిఫికేషన్స్
స్క్రీన్: HMD Vibe లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1480 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
ప్రాసెసర్: HMD Vibe లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4GHz.
ర్యామ్, స్టోరేజీ: HMD Vibe డివైజ్ అమెరికాలో 6జిబి ర్యామ్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 4జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంది. దీంతో యూజర్ కి గరిష్టంగా 10జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు.
కెమెరా: HMD Vibe లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ఫ్రంట్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ: HMD Vibe లో పవర్ బ్యాకప్ కోసం 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్లు: HMD Vibe లో భద్రత కోసం ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందించారు. ఐపీ52 స్ప్లాష్ రేటింగ్, బ్లూటూత్ 5.0, 3.5ఎంఎం ఆడియో జాక్, 4జీ, డ్యూయల్ సిమ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.











