
Nokia పేరెంట్ కంపెనీ HMD Global సొంతంగా తన బ్రాండ్ పేరుతో ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలె, HMD Pulse, Pulse+, Pulse Pro మరియు HMD Vibe అనే స్మార్ట్‌ఫోన్లు పరిచయం అయ్యాయి. ఇప్పుడు మరొక హెచ్ఎండీ స్మార్ట్‌ఫోన్ రివీల్ అయ్యింది. ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ Geekbench పై లిస్ట్ అయ్యింది. దీంతో ప్రాసెసర్ మరియు ర్యామ్ వివరాలు తెలిసాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.
గీక్‌బెంచ్‌పై లిస్టైన HMD కొత్త స్మార్ట్‌ఫోన్
బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై హెచ్ఎండీ కంపెనీకి చెందిన ఒక కొత్త ఫోన్ లిస్ట్ అయ్యింది.
గీక్‌బెంచ్ పై HMD Global Tomcat అనే కోడ్ నేమ్ తో ఈ స్మార్ట్‌ఫోన్ లిస్ట్ అయ్యింది.
HMD Global Tomcat స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.
ఈ ఫోన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.40GHz.
ప్రాసెసర్ వివరాలను చూస్తే, ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.
HMD Global Tomcat ఫోన్ సింగిల్-కోర్ట్ టెస్ట్ లో 978 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2664 పాయింట్లు స్కోర్ చేసింది.

HMD Pulse Pro స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: HMD Pulse Pro లో 6.56-ఇంచ్ ఐపీఎస్ స్క్రీన్, 1480*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సన్నని బెజెల్స్, ఫ్లాట్ డిస్ప్లే, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.
కెమెరా: HMD Pulse Pro లో 50ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి.
చిప్సెట్: HMD Pulse Pro లో యూనిఎస్ఓసీ టీ606 ప్రాసెసర్ ఉంటుంది. ఎంట్రీ లెవెల్ ఫోన్లలో ఎక్కువగా ఈ చిప్సెట్ కనిపిస్తుంది.
ర్యామ్, స్టోరేజీ: HMD Pulse Pro డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వస్తోందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. ఇతర మెమొరీ వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
బ్యాటరీ: HMD Pulse Pro డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ వివరాలు ఇంకా తెలియదు.
బరువు: HMD Pulse Pro డివైజ్ 196 గ్రాముల బరువు ఉంటుంది.
ఇతర ఫీచర్లు: HMD Pulse Pro డివైజ్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐపీ52 స్ప్లాష్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంటాయి.











