
Nokia బ్రాండ్ లైసెన్స్ హోల్డర్ HMD గ్లోబల్‌గా ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. HMD Skyline పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 108ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 12జిబి ర్యామ్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి HMD Skyline యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
HMD Skyline ధర, లభ్యత
HMD Skyline రెండు స్టోరేజీ వేరియంట్స్ లో గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వీటి ధరలు తెలుసుకుందాం.
8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను 399.99 యూరోలు (సుమారు రూ.43,000) గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 499.99 యూరోలు (సుమారు రూ.54,000) గా పెట్టారు.
HMD Skyline డివైజ్ ట్విస్టెడ్ బ్లాక్ మరియు నియాన్ పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
HMD Skyline స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: HMD Skyline లో 6.55-ఇంచ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, ఫుల్హెచ్డీ+ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 20:9 యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
ప్రాసెసర్: HMD Skyline స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ వాడారు.
మెమొరీ: HMD Skyline 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 512జిబి వరకు పెంచుకునే వీలుంది.
కెమెరా: HMD Skyline లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఈ కెమెరా సెటప్ ఓఐఎస్, ఈఐఎస్ టెక్నాలజీతో వచ్చింది. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ: HMD Skyline లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
సాఫ్ట్వేర్: HMD Skyline డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది. రెండేళ్ళు ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.
కనెక్టివిటీ: HMD Skyline లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: HMD Skyline లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్పీకర్స్, ఐపీ54 రేటింగ్, జెన్ 2 రిపేరబులిటీ ఆప్షన్స్ ఉన్నాయి.











