Nothing Phone (2a) Plus: టీడీఆర్ఏ సర్టిఫికేషన్ పొందిన నథింగ్ కొత్త ఫోన్

Highlights

  • త్వరలో Nothing Phone (2a) Plus లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ A142P
  • ప్లస్ అనే సింబల్ పోస్ట్ చేసిన నథింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Nothing త్వరలో కొత్త ఫోన్‌తో యూజర్ల ముందుకు రానుంది. ఇటీవలె నథింగ్ సబ్-బ్రాండ్ CMF నుంచి CMF Phone 1 లాంచ్ అయ్యింది. ఇప్పుడు Nothing Phone (2a) Plus మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీడీఆర్ఏ పై లిస్ట్ అయ్యింది. కొన్ని రోజుల క్రితం నథింగ్ సంస్థ తన సోషల్ మీడియా హ్యాండిల్ పై ప్లస్ అని పోస్ట్ చేసింది. దీంతో కొత్త ఫోన్ లాంచ్ ఉంటుందని స్పష్టమైంది. సరే, ఓసారి Nothing Phone (2a) Plus కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Nothing Phone (2a) Plus టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వివరాలు

Nothing Phone (2a) Plus స్మార్ట్‌ఫోన్ టీడీఆర్ఏ వెబ్‌సైట్ పై A142P అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. గత మోడల్ Nothing Phone (2a) కంటే మెరుగైన ఫీచర్లతో Nothing Phone (2a) Plus వస్తోందని అంతా భావిస్తున్నారు.

డివైజ్ పేరు, మోడల్ నంబర్ తప్పా.. టీడీఆర్ఏ లిస్టింగ్ ద్వారా మరే ఇతర వివరాలు రివీల్ కాలేదు. కానీ, త్వరలోనే లాంచ్ ఉంటుందని చెప్పవచ్చు.

Nothing Phone (2a) Plus లాంచ్

Nothing Phone (2a) Plus లాంచ్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో ప్లస్ అనే సింబల్ మనం గమనించవచ్చు. దీన్ని బట్టి, త్వరలో లాంచ్ కాబోయే ఫోన్ Nothing Phone (2a) Plus కావొచ్చని అంచనా వేస్తున్నారు. లాంచ్ టైమ్‌లైన్ విషయానికి వస్తే, రాబోయే కొన్ని వారాల్లో ఈ ఫోన్ టీజర్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత లాంచ్ ఉంటుంది.

Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Nothing Phone 2a లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (1080*2412 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Nothing Phone 2a లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. అంటుటు ప్లాట్ఫామ్ పై ఈ మొబైల్ 7,41,999 పాయింట్లు స్కోర్ చేసింది.

ర్యామ్, స్టోరేజీ: Nothing Phone 2a డివైజ్ 12జిబి ర్యామ్ సపోర్ట్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని కలిగి ఉంది.

కెమెరా: Nothing Phone 2a లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Nothing Phone 2a లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Nothing Phone 2a డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.