
ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung వచ్చే ఏడాది తన ఫ్లాగ్షిప్ సిరీస్ Galaxy S24 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో భాగంగా మొత్తం 3 ఫోన్లు రానున్నాయి. అవి: Samsung Galaxy S24, Samsung Galaxy S24+, Samsung Galaxy S24 Ultra. అయితే తాజాగా Samsung Galaxy S24+ కి సంబంధించి ఒక వార్త బయటకు వచ్చింది. ఈ మోడల్ డిస్ప్లేకి మార్పులు చేర్పులు ఉంటాయని సమాచారం. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
మరింత మెరుగైన డిస్ప్లేతో రానున్న Samsung Galaxy S24+
Exclusive! Galaxy S24+, resolution 3120×1440, WQHD+ screen regression!
— ICE UNIVERSE (@UniverseIce) August 29, 2023
- ప్రముఖ టిప్‌స్టర్ @IceUniverse ప్రకారం, Samsung Galaxy S24 సిరీస్ లోని 3 ఫోన్లు కూడా 2500 నిట్స్ మ్యాక్జిమమ్ బ్రైట్నెస్ తో రానున్నట్లు తెలుస్తోంది.
- ఇక Samsung Galaxy S24+ విషయానికి వస్తే, ఇది 3120 * 1440 WQHD+ రెజుల్యూషన్ డిస్ప్లేతో రానున్నట్లు సమాచారం.
- ఇది వరకు వచ్చిన 2340*1080 స్క్రీన్స్ స్థానంలో లేటెస్ట్ రెజుల్యూషన్ డిస్ప్లేస్ రానున్నాయి.
- అసలైతే, శాంసంగ్ సంస్థ తన ఫ్లాగ్షిప్ గ్రేడ్ డిస్ప్లేస్ ని Ultra వేరియంట్ లో మాత్రమే అందించేది. కానీ, ఈసారి మనం మరింత ప్రకాశవంతమైన, స్పష్టమైన స్క్రీన్స్ ని ప్లస్ మరియు స్టాండర్డ్ వేరియంట్స్ లో చూడవచ్చు.
Samsung Galaxy S24+ రెండర్
The first version of the Samsung Galaxy S24+ rendering, this time the S24+, the four sides including the middle frame are 2.5mm (S24 Ultra 3.4mm), the bezel part of the screen is about 1.5mm, and the middle frame is about 1.0mm. The rendering is as follows. The key is the top… pic.twitter.com/LhJesJIa74
— ICE UNIVERSE (@UniverseIce) August 29, 2023
- డిస్ప్లే వివరాలతో పాటు, @IceUniverse Samsung Galaxy S24+ యొక్క రెండర్ ని కూడా లీక్ చేసింది. దాని ప్రకారం, 2.5మి.మీ సైజ్ మిడిల్ ఫ్రేమ్, 1.0 మి.మీ బెజెల్స్ ఉన్నట్లు అర్థమవుతోంది.
- ఇకపోతే Samsung Galaxy S24+ డివైజ్ 195 గ్రాముల బరువు, 7.7 మి.మీ మందం ఉంటుంది.
- మార్పులు, చేర్పులను చూస్తుంటే ఈసారి Samsung Galaxy S24+ అమ్మకాలు బాగానే జరుగుతాయని అంచనా వేయవచ్చు.
Samsung Galaxy S24+ స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Samsung Galaxy S24+ లో 6.65-ఇంచ్ 2ఎక్స్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే ఉండే అవకాశం ఉంది.
- చిప్సెట్: Samsung Galaxy S24+ లో ఎగ్జినోస్ 2400 చిప్ మరియు స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్స్ వాడతారని అంచనా. ప్రాంతాలను బట్టి ప్రాసెసర్స్ మారతాయి.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy S24+ లో 8జిబి ర్యామ్ ఉంటుంది. ఇతర ర్యామ్ వేరియంట్ కూడా ఉండే చాన్స్ ఉంది. స్టోరేజీ విషయానికి వస్తే, 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ ఉంటాయని అంచనా.
- బ్యాటరీ: Samsung Galaxy S24+ స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4855 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 65 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోందని రీసెంట్ గా రూమర్లు వినిపించాయి.
- ఓఎస్: Samsung Galaxy S24+ డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేయనుంది.
- ఫ్రేమ్: Samsung Galaxy S24 సిరీస్ టైటానియమ్ ఫ్రేమ్ తో వస్తున్నట్లు సమాచారం.











