
Honor సంస్థ ఇటీవలె Honor 90 తో భారత మార్కెట్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తన రెండో ఫోన్ ని లాంచ్ చేసేందుకు హానర్ సంస్థ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా Honor X90b డివైజ్ భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే Honor X90b ఫోన్ ఇండియాలో లాంచ్ కానుందని అర్థమవుతోంది. అయితే లాంచ్ తేదీకి సంబంధించిన ప్రకటన హానర్ నుంచి రావాల్సి ఉంది. సరే, ఓసారి Honor X90b యొక్క బీఐఎస్ లిస్టింగ్ వివరాలను తెలుసుకుందాం పదండి.
Honor X90b బీఐఎస్ లిస్టింగ్
- బీఐఎస్ లిస్టింగ్ లో కనిపించిన Honor ఫోన్ మోడల్ నంబర్ ని కలిగి లేదు. అయితే త్వరలోనే ఒక కొత్త హానర్ డివైజ్ భారత్ లో లాంచ్ కానుందని ఈ లిస్టింగ్ ద్వారా అర్థమవుతోంది.
- బీఐఎస్ లిస్టింగ్ పై కనిపించిన ఫోన్ Honor X90b అని ఇండస్ట్రీ వర్గాల నుంచి 91మొబైల్స్ కి సమాచారం అందింది. Honor X90b ఫోన్ భారత్ లో డిసెంబర్ ఆఖర్లో లేదా జనవరి ఆరంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
- Realme 11 Pro సిరీస్ కి పోటీగా Honor X90b ని మార్కెట్ లోకి తీసుకొస్తున్నట్లు సమాచారం.
- హానర్ సంస్థ భారత్ లో Honor X90b డివైజ్ కి రూ.25,000 ధర పెట్టే అవకాశం ఉంది. రూ.37,999 తో భారత్ లో లాంచైన Honor 90 కంటే Honor X90b చవకైనదిగా చెప్పవచ్చు.
Honor X90b స్పెసిఫికేషన్స్ ఇంకా తెలియలేదు. ఈలోపు ఇప్పటికే పలు మార్కెట్స్ లో అందుబాటులో ఉన్న Honor X9b స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.
Honor X9b స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Honor X9b లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Honor X9b లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు.
- మెమొరీ: Honor X9b లో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
- కెమెరా: Honor X9b లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి మ్యాక్రో కెమెరా అందించారు.
- సాఫ్ట్‌వేర్: Honor X9b డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ, చార్జింగ్: Honor X9b లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కలర్స్: Honor X9b డివైజ్ సన్‌రైజ్ ఆరెంజ్, మిడ్నైట్ బ్లాక్ మరియు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.












