
వివో సబ్-బ్రాండ్ iQOO చైనాలో iQOO 12 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో iQOO 12 మరియు iQOO 12 Pro డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ సిరీస్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వచ్చింది. ఇంతకు ముందు Xiaomi 14 కూడా ఇదే చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. iQOO 12 సిరీస్ విషయానికి వస్తే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఐపీ68 రేటింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఇందులో ఉన్నాయి. సరే, ఓసారి iQOO 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
iQOO 12 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: iQOO 12 5G లో 6.78-ఇంచ్ 1.5కే బీఓఈ ఎల్ఈడీ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
- చిప్సెట్: iQOO 12 5G లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
- మెమొరీ: iQOO 12 5G డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీతో వస్తోంది.
- ఓఎస్: iQOO 12 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: iQOO 12 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
- బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్: iQOO 12 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
iQOO 12 Pro 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: iQOO 12 Pro 5G లో 6.78-ఇంచ్ 2కే శాంసంగ్ ఈ7 అమోలెడ్ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1440 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటాయి.
- ప్రాసెసర్: iQOO 12 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
- మెమొరీ: iQOO 12 Pro 5G లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
- బ్యాటరీ: iQOO 12 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.
- కెమెరా: iQOO 12 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి ఒవి64బి పెరిస్కోస్ ఓఐఎస్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ ఉంటుంది.
- ఇతర ఫీచర్లు: iQOO 12 Pro 5G లో 5జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, డ్యూయల్-ఫ్రీక్వెన్సీ జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డెడికేటెడ్ క్యూ1 డిస్ప్లే చిప్ (గేమింగ్ కోసం) ఉన్నాయి.











