హైలైట్స్:
- భారత్ లో లాంచ్ అయిన హాప్ ఆక్సో, ఆక్సో ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్స్, ధర రూ.1.25 లక్షలు
- 3.75 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ తో 150 కిలోమీటర్లు రానున్న రేంజ్, 5 గంటల్లో చార్జ్ కానున్న బ్యాటరీ
- మూడు రంగుల్లో లభ్యం కానున్న బైక్స్, దేశ వ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా మరియు 100 రిటైల్ షోరూమ్స్ ద్వారా అమ్మకాలు

హాప్ ఎలక్ట్రిక్ భారత్ లో హాప్ ఆక్సో ఎలక్ట్రిక్ బైక్ ని లాంచ్ చేసింది. ఈ బండి సింగిల్ చార్జ్ పై 150 కిలోమీటర్ల దూరం వెళ్తుందని కంపెనీ చెబుతోంది. ఆక్సో మరియు ఆక్సో ఎక్స్ అనే రెండు వేరియంట్లలో హాప్ ఆక్సో బండి లభిస్తుంది. జైపూర్ కి చెందిన ఈ ఎలక్ట్రిక్ కంపెనీ ఆక్సో బండిని దేశ వ్యాప్తంగా ఉన్న 100 షోరూమ్స్ ద్వారా అమ్మనుంది. అలాగే ఆన్లైన్ ద్వారా కూడా బండిని కొనుగోలు చేయవచ్చు. బైక్ ధర, రేంజ్, పెర్ఫామెన్స్ చూస్తే పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్లైన ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో, ఏథర్ 450ఎక్స్ లకు దీటుగా ఉంది. ఇకపోతే ఆక్సో బండి రివోల్ట్ ఆర్వీ400, టార్క్ క్రటోస్ తో పోటీపడనుంది.
భారత్ లో Hop Oxo ఎలక్ట్రిక్ బైక్ ధర, లభ్యత
ఆక్సో మరియు ఆక్సో ఎక్స్ అనే రెండు వేరియంట్లలో హాప్ ఆక్సో ఎలక్ట్రిక్ బైక్ లభిస్తుంది. వీటి ధర వరుసగా రూ.1.25 లక్షలు మరియు 1.40 లక్షలు. దేశ వ్యాప్తంగా ఉన్న 100 హాప్ షోరూమ్స్ తో పాటు, ఆన్ లైన్ ద్వారా ఈ బండ్లను కొనుగోలు చేయవచ్చు. ఆక్సో, ఆక్సో ఎక్స్ మూడు రంగుల్లో లభించనున్నాయి. అవి: రెడ్, గ్రీన్, బ్లూ.
ఆక్సో ఎక్స్ వేరియంట్ కనెక్టివిటీ ఫీచర్స్ తో పాటు 4 సంవత్సరాలు/బ్యాటరీపై అన్లిమిటెడ్ కిలోమీటర్ వ్యారంటీ తో వస్తోంది. ఇక తక్కువ ధర కలిగిన ఆక్సో 4 సంవత్సరాలు/బ్యాటరీపై 50,000 కిలోమీటర్ల వ్యారంటీ తో వస్తోంది. రెండు వేరియంట్లు కూడా వెహికిల్, మోటర్, చార్జర్, కంట్రోలర్ పై 3 ఏళ్ళ వ్యారంటీతో వస్తున్నాయి.
Hop Oxo స్పెసిఫికేషన్స్
ఆక్సో లో 3 కిలోవాట్ (కంటిన్యూస్)/5.2 కిలోవాట్ (పీక్) మోటర్ తో వస్తోంది. ఇక ఆక్సో ఎక్స్ 6.3 కిలోవాట్ పీక్ పవర్ తో వస్తోంది. 3.75 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 5 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. ఆక్సో లో మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అవి: ఇకో, పవర్, స్పోర్ట్. ఇక ఆక్సో ఎక్స్ ఈ మూడు మోడ్స్ తో పాటు అదనంగా టర్బో మోడ్ ని కలిగి ఉంటుంది. ఆక్సో మరియు ఆక్సో ఎక్స్ బండ్లు వరుసగా 90 కేఎంపీహెచ్, 95 కేఎంపీహెచ్ టాప్ స్పీడ్ ని కలిగి ఉన్నాయి.
ఆక్సో, ఆక్సో ఎక్స్ సింగిల్ చార్జ్ పై 150 కిలో మీటర్ల దూరం వెళ్తాయి. ఈ రెండు బైక్స్ 18-ఇంచ్ ఫ్రంట్, 17-ఇంచ్ రియర్ అల్లాయ్ వీల్స్, ట్విట్ డిస్క్ బ్రేక్స్, ఎల్ఈడీ లైటింగ్, 5-ఇంచ్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంటేషన్, 180ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, ఎలక్ట్రికల్స్ కి ఐపీ రేటింగ్ కలిగి ఉన్నాయి.
ఆక్సో ఎక్స్ వేరియంట్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, 4జీ, జీపీఎస్ ను కలిగి ఉంది.











