
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో Reno 11 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో OPPO Reno 11, OPPO Reno 11 Pro, OPPO Reno 11 Pro+ డివైజెస్ రానున్నాయి. అయితే ఒప్పో నుంచి ఈ సిరీస్ లాంచ్ కి సంబంధించి అధికార ప్రకటన ఇంకా రాలేదు. కానీ, లేటెస్ట్ లీక్ ద్వారా OPPO Reno 11 సిరీస్ లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
OPPO Reno 11 సిరీస్ డిజైన్ (లీక్)
- OPPO Reno 11 సిరీస్ కి సంబంధించిన ఇమేజెస్, ఇతర వివరాలు చైనీస్ మైక్రో బ్లాగింగ్ సైట్ వీబో ద్వారా రివీల్ అయ్యాయి.
- లీకైన OPPO Reno 11 ఇమేజ్ ద్వారా రెండు కలర్ ఆప్షన్స్ గ్రీన్ మరియు సిల్వర్ బయటకు వచ్చాయి.
- OPPO Reno 11 సిరీస్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ గత సిరీస్ OPPO Reno 10 తో పోల్చితే వేరుగా ఉంది.
- OPPO Reno 11 సిరీస్ లో ఉన్న కెమెరా మాడ్యూల్ చాలా పెద్దదిగా ఉంది. ఇంకా ఎల్ఈడీ ఫ్లాష్ కూడా కనిపిస్తోంది.
- తాజాగా బయటకు వచ్చిన డిజైన్ తోనే OPPO Reno 11 సిరీస్ రానుందని అంచనా వేస్తున్నారు.
OPPO Reno 11 సిరీస్ లాంచ్ తేదీ (లీక్)
- వీబో ద్వారా టిప్‌స్టర్ అందించిన సమాచారం ప్రకారం, OPPO Reno 11 సిరీస్ నవంబర్ 23 న చైనాలో లాంచ్ కానుందని తెలుస్తోంది.
- Honor 100 సిరీస్ ఇదే రోజుల లాంచ్ అవుతోంది.
- ధర విషయానికి వస్తే, OPPO Reno 11 సిరీస్ ప్రారంభ ధర చైనాలో CNY 3,000 (సుమారు రూ.34,200) ఉండే అవకాశం ఉంది.
OPPO Reno 10 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OPPO Reno 10 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: OPPO Reno 10 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్, మాలి-జీ68 జీపీయూ ఉన్నాయి.
- కెమెరా: OPPO Reno 10 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: OPPO Reno 10 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: OPPO Reno 10 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.











