రూ.9,999 కే, రూ.47,990 విలువ గల 43-inch స్మార్ట్ టీవీ

హైలైట్స్:

  • రూ.47,990 ధర కలిగిన 43-ఇంచ్ స్మార్ట్ టీవీ పై భారీ డిస్కౌంట్
  • ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్ లో రూ.9,999 లకే మీ సొంతం కానున్న స్మార్ట్ టీవీ
  • 43-అంగుళాల 4కే డిస్ప్లే, హెచ్డీఆర్10 సపోర్ట్ కలిగిన ఐఫాల్కన్ కే61 టీవీ

సెప్టెంబర్ 23 నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం అవుతోంది. ఇప్పటికే ప్లస్ మెంబర్స్ కి సేల్ లైవ్ లో ఉంది. ఈ సేల్ సందర్భంగా, అమేజింగ్ ఆఫర్స్ మిమ్మల్ని పలకరించబోతున్నాయి. ఎన్నో ఉత్తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ లభించనున్నాయి.

మీరు కనుక ఒక కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటే ఈ సేల్ సమయాన్ని వృథా చేయకండి. తక్షణం మీ అభిరుచికి తగిన టీవీని కొనుగోలు చేయండి. అది కూడా తక్కువ ధరలోనే. సరే ఇప్పుడు ఒక 43-ఇంచుల స్మార్ట్ టీవీని రూ.9,999 కే సొంతం చేసుకునే చక్కటి అవకాశం వచ్చింది. ఈ టీవీ అసలు ధర రూ.47,990. అంటే మీకు మొత్తంగా రూ.37,991 డిస్కౌంట్ వస్తుందన్న మాట. మరింకెందుకు ఆలస్యం ఆ టీవీ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

రూ.9,999 ధరలో 43-inch Smart TV

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా iFFALCON 43-inch (43K61) స్మార్ట్ టీవీ పై 56 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. వెబ్ సైట్ లో ఈ టీవీ ధర రూ.20,999 గా కనిపిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో పాటు ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు పై టీవీని కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది. దీనికి తోడు రూ.11,000 ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. అన్ని ఆఫర్లు కలుపుకుని యూజర్లకు ఈ టీవీ రూ.9,999 ధరకే లభించనుంది. అంతే కాదండోయ్, మీరు కనుక ఈఎంఐ లావాదేవీని ఎంచుకుంటే ప్రతి నెల రూ.728 చెల్లింపు పై ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు. మరి ఈ టీవీ యొక్క ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

ఫీచర్ల గని ‘iFFalcon K61’

  • iFFalcon K61 టీవీ 4కే డిస్ప్లే, 1,296 మైక్రో డిమ్మింగ్ జోన్స్, హెచ్డీఆర్10 సపోర్ట్ తో వస్తోంది.
  • క్లారిటీ, కలర్ కంపెన్సేషన్, ఫ్రీక్వెన్సీ కంపెన్సేషన్ లతో కలగలిసిన ఫోర్ డైమెన్షనల్ వీడియో మరియు పిక్చర్ క్వాలిటీ ఈ టీవీ సొంతం.
  • 24 వాట్స్ అవుట్‌పుట్ ఇవ్వనున్న 12 వాట్స్ కలిగిన రెండు స్పీకర్లు ఈ టీవీలో ఉన్నాయి. అలాగే ఇందులో డాల్బీ సపోర్ట్ ఉంది.
  • నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వీడియో లతో పాటు గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న 5000 యాప్స్ కి ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 9 ఓఎస్ పై ఈ టీవీ పని చేస్తుంది.
  • 2 జిబి ర్యామ్, 16 జిబి స్టోరేజీ, 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ ని ఇందులో అందించారు.

లేటెస్ట్ టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.