
తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో ఫోన్లను తీసుకురావడంలో Infinix సంస్థకు మంచి పేరుంది. తాజాగా ఈ సంస్థ Nothing Phone (2) లాంటి ఫోన్ ని మార్కెట్ లోకి తీసుకొస్తోంది. Infinix GT 10 Pro అనే పేరుతో రానున్న ఈ డివైజ్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి వస్తోంది. Nothing Phone (2) తో Infinix GT 10 Pro పోటీ పడనుంది. రెండు ఫోన్లు కూడా ట్రాన్స్‌పరెంట్ డిజైన్ తో ఉండటం వల్లన ఈ తరహా ఫోన్లను ఇష్టపడే వారికి 2 ఆప్షన్స్ దొరికినట్లైంది. ఇకపోతే Infinix GT 10 Pro డివైజ్ రూ.20,000 లోపు ధరలో వస్తుండటం విశేషం.
Infinix GT 10 Pro ప్రీ-బుకింగ్ వివరాలు
- ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ ప్రకారం, Infinix GT 10 Pro డివైజ్ రూ.20,000 లోపు ధరతో రానున్నట్లు తెలుస్తోంది.
- ఆగస్టు 3 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి యూజర్లు ఫోన్ ని ప్రీ-బుక్ చేసుకోవచ్చు.
- ప్రీ-బుకింగ్ ఆఫర్స్ గురించి మాట్లాడితే, మొదటి 5000 కస్టమర్లకు కంపెనీ ప్రో గేమింగ్ కిట్ ని ఉచితంగా అందిస్తోంది. ఈ కిట్ లో యూనివర్శల్ షోల్డర్ ట్రిగ్గర్, గేమింగ్ ఫింగర్ స్లీవ్స్, కార్బన్ బాక్స్ ఉంటాయి.
- అంతేకాదు, ఫోన్ పై కంపెనీ రూ.2,000 డిస్కౌంట్ లేదా రూ.2,000 ఎక్స్‌చేంజ్ బోనస్ ని ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు, 6 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ని కూడా ఆఫర్ చేస్తోంది.
Infinix GT 10 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)
- స్క్రీన్: Infinix GT 10 Pro లో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ ఉంటాయి.
- ప్రాసెసర్: Infinix GT 10 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ ఉంటుంది.
- స్టోరేజీ: Infinix GT 10 Pro లో 26జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
- కెమెరా: Infinix GT 10 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, రెండు 8ఎంపి కెమెరా సెన్సర్స్ ఉంటాయి.
- బ్యాటరీ: Infinix GT 10 Pro లో పవర్ బ్యాకప్ కోసం 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 160 వాట్ మరియు 260 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీతో వస్తోంది.
- ఓఎస్: Infinix GT 10 Pro ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Infinix GT 10 Pro లో డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.











