లాంచ్‌కి ముందు లీకైన iQOO Z7 Pro 5G స్పెసిఫికేషన్స్, భారత మార్కెట్ ధర!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న iQOO Z7 Pro 5G
  • ఇప్పటికే అధికార ప్రకటన చేసిన కంపెనీ
  • భారత్ లో iQOO Z7 Pro 5G ధర రూ.25,000 ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్, వివో సబ్-బ్రాండ్ అయిన ఐకూ త్వరలో భారతీయ మార్కెట్ లో iQOO Z7 Pro 5G ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ డివైజ్ కి సంబంధించిన అధికార ప్రకటనను కంపెనీ ఇండియా హెడ్ నిపుణ్ మార్య తన సోషల్ మీడియా హ్యాండిల్ పై షేర్ చేసారు. తాజాగా iQOO Z7 Pro 5G భారత మార్కెట్ ధర, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

లీకైన iQOO Z7 Pro 5G ధర

iQOO Z7 Pro 5G స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్ ధరను టిప్‌స్టర్ పారస్ గుగ్లాని షేర్ చేసారు. గుగ్లాని ప్రకారం, iQOO Z7 Pro 5G ప్రారంభ ధర దాదాపు రూ.25,000 ఉండనుంది. ఇంకా టాప్ వేరియంట్ ధర రూ.30,000 వరకు ఉండవచ్చని టిప్‌స్టర్ చెబుతున్నారు. OnePlus Nord CE 3, Redmi Note 12 Pro 5G ల యొక్క ధరల సెగ్మెంట్ లోనే iQOO Z7 Pro 5G ధర ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

iQOO Z7 Pro 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: iQOO Z7 Pro 5G లో 6.78-ఇంచ్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ స్క్రీన్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: iQOO Z7 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆక్టా-కోర్ చిప్సెట్ వాడనున్నారు.
  • ఓఎస్: iQOO Z7 Pro 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Z7 Pro 5G రెండు ర్యామ్ వేరియంట్స్ లో లాంచ్ అవుతోంది. బేస్ వేరియంట్ 8జిబి ర్యామ్ ని ఆఫర్ చేయనుండగా, టాప్ వేరియంట్ 12జిబి ర్యామ్ ని ఆఫర్ చేస్తోంది. ఇకపోతే 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ ఉంటాయి.
  • కెమెరా: iQOO Z7 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: iQOO Z7 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.