
ఇటీవలె ఇన్ఫినిక్స్ సంస్థ భారతీయ మార్కెట్ లో Infinix Hot 30 5G ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ.12,499 ధరతో వచ్చింది. తాజాగా ఈ కంపెనీ ఫ్లాగ్షిప్ ఫోన్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఒక కొత్త గేమింగ్ ఫోన్ ని భారత్ కి తీసుకురానున్నట్లు సమాచారం. Infinix GT 10 Pro పేరుతో రానున్న ఈ ఫోన్ ఆగస్టు నెలలో భారత్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సరే, ఓసారి Infinix GT 10 Pro విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Infinix GT 10 Pro ఇండియా లాంచ్ వివరాలు
మీడియా కథనాల ప్రకారం, ఇన్ఫినిక్స్ కంపెనీ Infinix GT 10 Pro అనే గేమింగ్ ఫోన్ ని భారత్ లో వచ్చే నెలలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది. అయితే కంపెనీ దీనికి సంబంధించిన ఇంకా ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. ఆగస్టు మొదటివారంలోనే భారత్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. అతి త్వరలో Infinix GT 10 Pro ని కంపెనీ టీజ్ చేయనుందని అంచనా వేస్తున్నారు.
Infinix GT 10 Pro లుక్, డిజైన్
Infinix GT 10 Pro స్మార్ట్ ఫోన్ పిక్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఫోన్ డిజైన్ రివీల్ అయ్యింది. నథింగ్ ఫోన్ స్పూర్తితో Infinix GT 10 Pro డివైజ్ రూపొందనున్నట్లు అర్థమవుతోంది. సెమీ-ట్రాన్స్‌పరెంట్ డిజైన్, గ్లైఫ్ లైట్ తో Infinix GT 10 Pro డివైజ్ వస్తున్నట్లు తెలుస్తోంది.
Infinix GT 10 Pro డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో భారీ కెమెరా కటౌట్స్ ఉంటాయి. ఫోన్ రౌండెడ్ ఎడ్జెస్ ని కలిగి ఉంది. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్ ప్యానెల్ కి కుడివైపున ఉన్నాయి. ఈ ఫోన్ కి బాటమ్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ ఉన్నాయి.
Infinix GT 10 Pro స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Infinix GT 10 Pro లో 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Infinix GT 10 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడనున్నట్లు సమాచారం. అదే విధంగా ప్రో+ మోడల్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
- ర్యామ్, స్టోరేజీ: Infinix GT 10 Pro లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. 256జిబి స్టోరేజీ వేరియంట్ కూడా ఉంటుందని సమాచారం.
- కెమెరా: Infinix GT 10 Pro స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. ఫోన్ ఇమేజ్ లో 108ఎంపి అని రాసి ఉండటం మనం గమనించవచ్చు. ఇంకా Infinix GT 10 Pro లో 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది.
- కనెక్టివిటీ: Infinix GT 10 Pro లో బ్లూటూత్, డ్యూయల్ సిమ్, వై-ఫై, 5జీ, 4జీ, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉండవచ్చు.











