Sony IMX890 సెన్సర్‌తో వస్తోన్న OPPO K11

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO K11
  • ఫ్లాగ్షిప్ కెమెరాతో వస్తోన్న డివైజ్
  • వీడియో ద్వారా లీకైన వివరాలు

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో త్వరలో OPPO K11 అనే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ డివైజ్ రీసెంట్ గా పలు సర్టిఫికేషన్స్ సైట్స్ పై కనిపించింది. తాజాగా ఒప్పో అధికారిక వీడియో ద్వారా OPPO K11 డిజైన్ రివీల్ అయ్యింది. చూస్తుంటే, ఈ ఫోన్ గతంలో మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి విడుదలైన ఫోటోల మాదిరే ఉన్నాయి.

బయట నుంచి చూస్తే, OPPO K11 స్లీకర్ లైన్స్ కలిగి, రియర్ డిజైన్ ఒప్పో రెనో 9 సిరీస్ ని పోలి ఉంది. స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, కొత్త స్మార్ట్ ఫోన్ OnePlus Nord CE 3 5G కి దగ్గరగా సరిపోలుతుందనిపిస్తోంది. సీఈ 3 5జీ ఇటీవలె భారత్ లో లాంచ్ అయ్యింది.

OPPO K11 స్పెసిఫికేషన్స్ (లీక్)

డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, OPPO K11 స్మార్ట్ ఫోన్ Honor X50, Redmi Note మోడల్ తో పోటీ పడనుంది. ఇకపోతే OPPO K11 డివైజ్ సోని ఐఎంఎక్స్890 కెమెరా సెన్సర్ తో వస్తున్నట్లు సమాచారం. గతంలో Find X6 సిరీస్ లో కూడా ఇదే సెన్సర్ ని వాడారు. తొలిసారిగా మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ఈ సెన్సర్ ని పరిచయం చేస్తున్నారు.

TENAA, 3C సర్టిఫికేషన్ ద్వారా OPPO K11 స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

  • డిస్ప్లే: OPPO K11 లో 6.7-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, సెంటర్డ్ పంచ్-హోల్ డిజైన్ ఉంటాయి.
  • కెమెరా: OPPO K11 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. ప్రైమరీ కెమెరా సోని ఐఎంఎక్స్890 సెన్సర్ తో రానున్నట్లు సమాచారం.
  • డైమెన్షన్స్: OPPO K11 స్మార్ట్ ఫోన్ 8.23 మి.మీ మందం, 184 గ్రాముల బరువు ఉంటుంది.
  • ప్రాసెసర్: OPPO K11 లో 2.7 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంటుందని సమాచారం. ఈ డివైజ్ స్నాప్ డ్రాగన్ 782జి చిప్సెట్ తో వస్తున్నట్లు కొన్ని రూమర్ల ద్వారా తెలుస్తోంది.
  • బ్యాటరీ: OPPO K11 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4870 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో రానున్నట్లు సమాచారం. ఈ కొత్త మోడల్ ప్రత్యేకించి చైనీస్ మార్కెట్ ని ఉద్దేశించి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.