చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix నేడు భారతీయ మార్కెట్ లో Infinix GT 20 Pro డివైజ్ ని లాంచ్ చేసింది. గేమింగ్ కోసం ఫోన్ కొనేవారికి ఇది మంచి బడ్జెట్ ఆప్షన్ కానుంది. 8జిబి/12జిబి ర్యామ్ వేరియంట్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. 8జిబి ర్యామ్ వేరియంట్ ధరను రూ.24,999 గా పెట్టారు. Infinix GT 20 Pro డివైజ్ లో ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
Infinix GT 20 Pro లో ఉన్న టాప్ ఫీచర్లు
ఆడియో: Infinix GT 20 Pro లో డ్యూయల్ స్పీకర్స్ అందించారు. JBL ఆడియోతో జట్టుకట్టి ఇన్ఫినిక్స్ అద్భుతమైన సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ని యూజర్లకు ఈ ఫోన్ ద్వారా అందిస్తోంది.
డిస్ప్లే: Infinix GT 20 Pro లో డెడికేటెడ్ గేమింగ్ డిస్ప్లే చిప్ Pixelworks X5 Turbo అందించారు. దీని ద్వారా 90FPS గేమింగ్ సాధ్యమవుతుంది. ఇంకా వీసీ లిక్విడ్ కూలింగ్ ఫీచర్ కూడా ఉంది. అలాగే 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ గేమింగ్ అనుభూతిని మెరుగుపరచనుంది. అంతేకాదు, 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
కెమెరా: Infinix GT 20 Pro లో 108ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరాను అందించారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ గల ఈ కెమెరాతో ఫోటోలు, వీడియోలను స్పష్టంగా తీసుకోవచ్చు.
ప్రాసెసర్: Infinix GT 20 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్, మాలి-జీ610 గ్రాఫిక్స్ అందించారు. గేమింగ్ కి ఈ చిప్సెట్ బాగా సరిపోతుంది.
బ్యాటరీ: Infinix GT 20 Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది. హైపర్ చార్జ్ మోడ్ పై ఇది పని చేస్తుంది.
Infinix GT 20 Pro ధర
Infinix GT 20 Pro 5G రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఓసారి వాటి ధరలు తెలుసుకుందాం.
Infinix GT 20 Pro 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.24,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది.
ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్‌సీ మరియు ఎస్బీఐ బ్యాంక్ కార్డ్స్ ద్వారా ఫోన్ కొంటే రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది.
మే 28 నుంచి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా Infinix GT 20 Pro 5G ని కొనుగోలు చేయవచ్చు.
మెకా ఆరెంజ్, మెకా సిల్వర్ మరియు మెకా బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ తో రూ.5,499 విలువజేసే గేమింగ్ కిట్‌ను కంపెనీ ఉచితంగా అందిస్తోంది. ఈ కిట్ లో జీటీ మెకా కేస్, జీటీ కూలింగ్ ఫ్యాన్ మరియు జీటీ ఫింగర్ స్లీవ్స్ లభిస్తాయి. లాంచ్ ఆఫర్ లో భాగంగా పరిమిత కాలం పాటు వీటిని అందిస్తున్నారు.
