
స్మార్ట్‌ఫోన్ తయారీదారు Infinix తన తదుపరి లైనప్ Infinix GT సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. దీని ప్రత్యేకత ఏంటంటే, డివైజ్ ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది. దీనికి తోడు, ఎల్ఈడీ లైట్స్ కూడా ఉండనున్నాయి. అంటే మనం ఇదివరకు చూసిన నథింగ్ ఫోన్ డిజైన్ మాదిరిగానే Infinix GT సిరీస్ డిజైన్ ఉండబోతోంది. అతి త్వరలో Infinix GT సిరీస్ మార్కెట్ లోకి రానుంది. సరే, ఓసారి Infinix GT సిరీస్ విశేషాలేంటో తెలుసుకుందాం.
Infinix GT సిరీస్
ఇన్ఫినిక్స్ సంస్థ తన భారతదేశపు సోషల్ మీడియా హ్యాండిల్ పై Infinix GT సిరీస్ లాంచ్ ని ఖరారు చేసింది.
- కొత్త టీజర్ వీడియోని తన పోస్ట్ ద్వారా కంపెనీ పంచుకుంది. ఇందులో ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్, ఎల్ఈడీ లైట్స్ కనిపిస్తున్నాయి.
- వీడియోలో కెమెరా సెటప్ కూడా కనిపిస్తోంది. ఇది ఎంతో స్టైలిష్ గా, యూనిక్ గా కనిపిస్తోంది.
- త్వరలోనే Infinix GT సిరీస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తుందని ఇన్ఫినిక్స్ తెలిపింది.
- కంపెనీ డివైజ్ పేరుని తెలపలేదు. కానీ, లీక్ ప్రకారం, Infinix GT Pro 5G, Infinix GT 10 Pro+ 5G అనే ఫోన్లు ఈ లేటెస్ట్ సిరీస్ లో లాంచ్ కానున్నాయని తెలుస్తోంది.
- ఈ రెండు మోడల్స్ లో Infinix GT 10 Pro 5G భారత్ లో లాంచ్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అందరూ భావిస్తున్నారు. అదే విధంగా, ప్రో+ వేరియంట్ గ్లోబల్ గా లాంచ్ కానుందని తెలుస్తోంది.
Beware! This device is not for the faint of heart. If you wish to proceed, do so with extreme caution!
The Badass Infinix GT Series is coming soon to redefine what a smartphone means. Stay tuned!#InfinixGT #ComingSoon pic.twitter.com/9DP4B6mKLc
— Infinix India (@InfinixIndia) July 19, 2023
Infinix GT 10 Pro 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
గత కొన్ని రోజులుగా, Infinix GT సిరీస్ కొత్త లీక్స్ హడావుడి చేస్తున్నాయి. సరే, ఓసారి Infinix GT 10 Pro 5G స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
- డిస్ప్లే: Infinix GT 10 Pro 5G లో అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Infinix GT 10 Pro 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ ఉంటుందని అంచనా.
- ర్యామ్, స్టోరేజీ: Infinix GT 10 Pro 5G డివైజ్ 26జిబి ర్యామ్ కలిగిన ప్రపంచపు తొలి ఫోన్ గా లాంచ్ కానుందని సమాచారం. ఇతర ర్యామ్ వేరియంట్స్ కూడా ఉండనున్నాయి. ఇక స్టోరేజీ విషయానికి వస్తే, ఈ ఫోన్ మాగ్జిమమ్ 256జిబి స్టోరేజీ వరకు ఆఫర్ చేస్తుంది.
- కెమెరా: Infinix GT 10 Pro 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 100 ఎంపి మెయిన్ కెమెరా, రెండు 8ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్స్ ఉంటాయని సమాచారం.
- బ్యాటరీ: Infinix GT 10 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. ఇది 260W/160W ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్స్ తో వస్తుందని అంచనా వేస్తున్నారు.
- ఓఎస్: Infinix GT 10 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Infinix GT 10 Pro 5G లో వై-ఫై, బ్లూటూత్, ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్, 5జీ కనెక్టివిటీ ఉంటాయి.











