6000mAh బ్యాటరీతో లాంచైన Infinix Hot 30 Play, మొదటి సేల్ ఈ దేశంలోనే!

Highlights

  • నైజీరియాలో లాంచైన Infinix Hot 30 Play
  • 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వచ్చిన డివైజ్
  • ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ ధర సుమారు రూ.14,000

ఇన్ఫినిక్స్ సంస్థ తాజాగా Infinix Hot 30 Play అనే ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. నైజీరియా దేశంలో కొనుగోలుకి అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. Infinix Hot 30 Play డివైజ్ 4జీ కనెక్టివిటీ, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. సరే, ఓసారి Infinix Hot 30 Play డివైజ్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Infinix Hot 30 Play స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

Infinix Hot 30 Play స్మార్ట్ ఫోన్ లో 6.82-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1640 పిక్సెల్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. ఈ స్క్రీన్ 500 నిట్స్ బ్రైట్నెస్, 85 పర్సెంట్ కలర్ గేముత్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా విభాగం

Infinix Hot 30 Play స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 16ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

చిప్సెట్, ర్యామ్

Infinix Hot 30 Play స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్ వాడారు. 4జిబి వరకు ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఈ ఫోన్ లో ఉంది. Infinix Hot 30 Play 4జిబి ఇంటర్నల్ ర్యామ్ ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ, చార్జింగ్

Infinix Hot 30 Play లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ ని పవర్ బటన్ లో ఎంబెడ్ చేశారు.

Infinix Hot 30 Play ధర

Infinix Hot 30 Play స్మార్ట్ ఫోన్ ధర నైజీరియా లో NGR 80,000 గా ఉంది. భారత కరెన్సీలో ఈ ఫోన్ ధర రూ.14,000 గా ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ బోరా పర్పుల్, మిరాజ్ వైట్ మరియు బ్లేడ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.