లీకైన రగ్డ్ స్మార్ట్ ఫోన్ Nokia XR30 డిజైన్, స్పెసిఫికేషన్స్

Highlights

  • కొన్ని నెలల్లో Nokia XR30 ని లాంచ్ చేయనున్న HMD Global
  • రెండు కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Nokia XR30
  • లాంచ్ ధర 499 డాలర్లు (రూ.40,820) ఉండే అవకాశం

ప్రముఖ మొబైల్ ఫోన్ బ్రాండ్ నోకియా త్వరలో ఒక కొత్త రగ్డ్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే Nokia XR30 అనే డివైజ్ త్వరలో జనాల ముందుకు రానుంది. అయితే, కంపెనీ నుంచి ఈ ఫోన్ కి సంబంధించిన వివరాలు ఇంకా అనౌన్స్ కావాల్సి ఉంది. తాజాగా WinFuture.de అనే వెబ్ సైట్ Nokia XR30 డివైజ్ డిజైన్, స్పెసిఫికేషన్స్, ధర కి సంబంధించిన సమాచారాన్ని ప్రచురించింది.

Nokia XR30 స్మార్ట్ ఫోన్ గతంలో Nokia Sentry 5G అనే పేరుతో వస్తోందని అనుకున్నారు. అయితే, కొత్త కథనం ప్రకారం, ఈ డివైజ్ Nokia XR లేదా Nokia XR30 అనే పేరుతో లాంచ్ కానుందని తెలుస్తోంది. 2022 లో హెచ్ఎండీ గ్లోబల్ యొక్క రోడ్‌మ్యాప్ లో నోకియా సెంట్రీ 5జీ ఫోన్ పేరు కనిపించింది. ఇది సదరు సంస్థ యూట్యూబ్ లో చేసిన ప్రజెంటేషన్ ద్వారా రివీల్ అయ్యింది. సరే, ఓసారి లీకైన నోకియా ఫోన్ సమాచారం ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.

Nokia XR30 ధర, కలర్స్ (అంచనా)

Nokia XR30 స్మార్ట్ ఫోన్ ధర 499 డాలర్లు (సుమారు రూ.40,820) గా ఉండే అవకాశం ఉంది. గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ హ్యాండ్సెట్ లభిస్తుంది. అయితే, కంపెనీ ఇప్పటి వరకు ఏ విషయం వెల్లడించలేదు. భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందా లేదా అన్న విషయం ఇంకా తెలియదు. దీనిపై కంపెనీ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

Nokia XR30 డిజైన్, స్పెసిఫికేషన్స్

డిజైన్

అఫీషియల్ మార్కెటింగ్ పిక్చర్స్ లో ఫోన్ రగ్డ్ లుక్ ని కలిగి ఉంది. అంటే టఫ్ బాడీతో వస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై కెమెరా మాడ్యూల్ కనిపిస్తోంది. ఇందులో రెండు కెమెరా సెన్సర్స్ ఒక ఫ్లాష్ ఉన్నాయి. ఇంకా XR అనే ఆంగ్ల అక్షరాలు కనిపిస్తున్నాయి.

కెమెరాలు

Nokia XR30 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ

Nokia XR30 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. రిపోర్ట్ ప్రకారం, ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుందని సమాచారం.

ఇప్పటి వరకు, స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లే, చిప్సెట్ వివరాలు బయటకు రాలేదు. కానీ, ఇది 5జీ స్మార్ట్ ఫోన్ అని కచ్చితంగా చెప్పగలం. మరింత సమాచారం కోసం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous article6000mAh బ్యాటరీతో లాంచైన Infinix Hot 30 Play, మొదటి సేల్ ఈ దేశంలోనే!
Next articleకేవలం రూ.5,999 ధరతో భారత్‌లో లాంచైన Infinix Smart 7 HD
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.