
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో హాట్ 50 సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Infinix Hot 50 5G అనే డివైజ్ ఎంట్రీ ఇవ్వనుంది. సెప్టెంబర్ 5వ తేదీన ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానుందని కంపెనీ ఇటీవలె కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ లో ఇప్పటికే హాట్ 50 యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది. తాజాగా 91మొబైల్స్ కి Infinix Hot 50 5G యొక్క ధర శ్రేణి వివరాలు తెలిసాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.
Infinix Hot 50 5G ధర శ్రేణి
Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో రూ.9,000 లోపు ధరతో లాంచ్ కానుందని 91మొబైల్స్ కి సమాచారం లభించింది. ఇది బేస్ వేరియంట్ ధర. అలాగే దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి.
Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీతో రానుంది.
Infinix Hot 50 5G డివైజ్ లో డైనమిక్ బార్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, టీయూవీ సర్టిఫికేషన్ ఉంటాయి.
Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ లో మొదటిసారి టీయూవీ ఎస్‌యూడీ ఏ లెవెల్ 60-నెలల ఫ్లూయెన్సీ అస్యూరెన్స్ తో వస్తోంది. అంటే 5 ఏళ్ళ పాటు ల్యాగ్స్ లేని మంచి పెర్ఫామెన్స్‌ని ఈ ఫోన్ అందిస్తుంది.
Infinix Hot 50 5G కెమెరా
Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ లో 48ఎంపి ఏఐ మెయిన్ కెమెరా, డ్యూయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉంటాయి. 5జీ ఫోన్ కేటగిరీలో 7.8 ఎంఎం మందంతో వస్తోన్న అత్యంత సన్నని ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది.
Infinix Hot 50 5G డిజైన్
Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. ముందువైపు, పంచ్ హోల్ నాచ్ డిస్ప్లే ఉంటుంది. ఐపీ54 స్ప్లాష్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ తో ఈ ఫోన్ వస్తోంది. హాట్ 50 5జీ బ్లూ, బ్లాక్ మరియు గ్రీన్ కలర్స్ లో లాంచ్ కానుంది.
Infinix Hot 50 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్ ఉంటుంది.
Infinix Hot 50 5G డివైజ్ 4జిబి, 8జిబి ర్యామ్, 128జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో వస్తోంది.
Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ లో ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.











