POCO C65 పై డిస్కౌంట్ ఆఫర్, పూర్తి వివరాలు తెలుసుకోండి

Highlights

  • POCO C65 పై 36 శాతం డిస్కౌంట్
  • అమెజాన్ లో అందుబాటులో ఆఫర్
  • డిస్కౌంట్ తర్వాత ధర రూ.6,998

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO గతేడాది డిసెంబర్ నెలలో తన సీ-సిరీస్ ఫోన్ POCO C65 ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఎంట్రీ లెవెల్ కస్టమర్ల కోసం తక్కువ ధరలో ఈ ఫోన్ విడుదలైంది. తాజాగా ఈ ఫోన్ పై రియల్మీ సంస్థ ఆఫర్ ప్రకటించింది. రూ.1,501 వరకు ఈ ఫోన్ పై డిస్కౌంట్ పొందవచ్చు. డిస్కౌంట్ ఆఫర్ వివరాలను తెలుసుకుందామా?

POCO C65 డిస్కౌంట్ ఆఫర్ వివరాలు

POCO C65 స్మార్ట్‌ఫోన్‌ని ప్రస్తుతం ఈ-కామర్స్ సైట్స్ అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ లపై కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ ఆఫర్ వివరాలను చూస్తే, POCO C65 పై 36 శాతం అనగా, రూ.1,501 డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్ కేవలం రూ.6,998 కే లభించనుంది.

4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్ తో రూ.8,499 ధరతో POCO C65 లాంచ్ అయ్యింది.

డిస్కౌంట్ తో పాటు, నో కాస్ట్ ఈఎంఐ మరియు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అమెజాన్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.

POCO C65 ఇంకా 6జిబి+128 మరియు 8జిబి+256జిబి వేరియంట్స్ లో కూడా లభిస్తుంది. వీటి ధరలను వరుసగా రూ.7,499 మరియు రూ.10,998 గా ఉన్నాయి.

POCO C65 ఫోన్ ఫ్లిప్‌కార్ట్ పై కూడా కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఇక్కడ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.6,999 గా ఉంది.

ఈ ఫోన్ కొనుగోలుపై, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీంతో పాటు, ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,499 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది.

POCO C65 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: POCO C65 లో 6.74-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1650*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉన్నాయి.

ప్రాసెసర్: POCO C65 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: POCO C65 లో 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉన్నాయి.

ఓఎస్: POCO C65 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ: POCO C65 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: POCO C65 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, ఒక ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

కనెక్టివిటీ: POCO C65 లో డ్యూయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

సెక్యూరిటీ: POCO C65 లో భ్రదత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

Previous articleRealme: సెప్టెంబర్ 9న లాంచ్ అవుతోన్న Narzo 70 Turbo 5G
Next articleInfinix Hot 50 5G: రివీలైన ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ధర శ్రేణి
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.