Infinix Hot 50 vs itel Color Pro: ఏది బెటర్ బడ్జెట్ ఫోన్?

    Infinix Hot 50 భారత్‌లో రూ.9,999 ధరతో లాంచ్ అయ్యింది. ఇదొక ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్. తక్కువ ధరలో పర్వాలేదనిపించే స్పెసిఫికేషన్స్ ను ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. చవకగా ఒక మంచి ఫోన్ కొనాలని భావించే వారికి ఈ ఫోన్ సరిపోతుంది.

    అయితే, ఇదే ధర శ్రేణిలో ఐటెల్ కంపెనీ నుంచి itel Color Pro అనే ఎంట్రీ లెవెల్ ఫోన్ అందుబాటులో ఉంది. కలర్ చేంజింగ్ టెక్నాలజీతో వచ్చిన ఇది ఇన్ఫినిక్స్ హాట్ 50 కి ఆల్టర్నేటివ్ ఆప్షన్‌గా నిలవనుంది. ఈ ఆర్టికల్ లో, మేం Infinix Hot 50 మరియు itel Color Pro ఫోన్లను పోల్చి చూసి, రెండింట్లో ఏది బెటర్ ఆప్షన్, ఏది వాల్యూ ఫర్ మనీ ఆప్షనో చెప్పే ప్రయత్నం చేస్తాం.

    Infinix Hot 50 vs itel Color Pro: స్పెసిఫికేషన్స్

    స్పెసిఫికేషన్స్ ఇన్ఫినిక్స్ హాట్ 50 ఐటెల్ కలర్ ప్రో
    డిస్ప్లే 6.7-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్ 6.6-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్
    డైమెన్షన్స్ 165.7 మి.మీ x 77.1 మి.మీ x 7.8 మి.మీ 163.5 మి.మీ x 75.5 మి.మీ x 8.3 మి.మీ
    బరువు 188 గ్రాములు 190 గ్రాములు
    సాఫ్ట్‌వేర్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఎక్స్ఓఎస్ 14 ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఐటెల్ఓఎస్
    రియర్ కెెమెరా 48ఎంపి ప్రైమరీ ఏఐ కెమెరా 50ఎంపి ప్రైమరీ ఏఐ సెన్సర్
    ఫ్రంట్ కెమెరా 8ఎంపి 8ఎంపి
    వీడియో 1080పి/30ఎఫ్‌పీఎస్ 1080పి/30ఎఫ్‌పీఎస్
    చిప్సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 మీడియాటెక్ డైమెన్సిటీ 6080
    బ్యాటరీ, చార్జింగ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ చార్జింగ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ చార్జింగ్
    ర్యామ్, స్టోరేజీ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ 6జిబి ర్యామ్/128జిబి స్టోరేజీ
    కలర్స్ స్లీక్ బ్లాక్, వైబ్రంట్ బ్లూ, సేజ్ గ్రీన్, డ్రీమీ పర్పుల్ లావెండర్ ఫాంటసీ & రివర్ బ్లూ

     

    Infinix Hot 50 vs itel Color Pro: ధర

    ఇన్ఫినిక్స్ హాట్ 50 ఐటెల్ కలర్ ప్రో
    4జిబి+128జిబి ధర రూ.9,999 6జిబి+128జిబి ధర రూ.9,999
    6జిబి+128జిబి ధర రూ.10,999

     

    Infinix Hot 50 vs itel Color Pro: డిజైన్

    ఇన్ఫినిక్స్ హాట్ 50 ప్లాస్టిక్ మరియు వీగన్ లెదర్ మోడల్స్ లో అందుబాటులో ఉంది. స్లీక్ బ్లాక్, వైబ్రంట్ బ్లూ, సేజ్ గ్రీన్ కలర్స్ ప్లాస్టిక్ బాడీ, మ్యాట్ ఫినిష్ తో వచ్చాయి. డ్రీమీ పర్పుల్ వేరియంట్ మాత్రం వీగన్ లెదర్ బాడీతో వచ్చింది. ఇంకా ఈ ఫోన్ ఐపీ54 రేటింగ్ తో వచ్చింది.

    మరోవైపు, ఐటెల్ కలర్ ప్రో ప్లాస్టిక్ బాడీ, డ్యూయల్ టోన్ ఫినిష్ తో వచ్చింది. సూర్యకాంతి పడినప్పుడు ఈ ఫోన్ యొక్క బ్యాక్ ప్యానెల్ రంగులు మారుస్తుంది. ఇదే ఈ ఫోన్ లో హైలైట్ అని చెప్పవచ్చు. ఇకపోతే, ఈ ఫోన్ లావెండర్ ఫాంటసీ మరియు రివర్ బ్లూ కలర్స్ లో లభిస్తుంది. అయితే, ఈ ఫోన్ ఐపీ రేటింగ్ తో రాలేదు.

    Infinix Hot 50 vs itel Color Pro: డిస్ప్లే

    ఇన్ఫినిక్స్ హాట్ 50 మరియు ఐటెల్ కలర్ ప్రో ఫోన్లు రెండూ కూడా ఒకే విధమైన డిస్ప్లే స్పెసిఫికేషన్స్ కలిగి ఉన్నాయి. హాట్ 50 లో కాస్త పెద్ద డిస్ప్లే ఉంది. ఐపీఎస్ ఎల్సీడీ హెచ్డీ+ రెజుల్యూషన్ రెండు ఫోన్లలో అందించారు. క్వాలిటీ డీసెంట్ గా ఉంటుంది.

    అయితే, ఇన్ఫినిక్స్ హాట్ 50 లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. ఈ విషయంలో ఐటెల్ కలర్ ప్రో కంటే మెరుగ్గా ఉంది. ఐటెల్ కలర్ ప్రో లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇచ్చారు.

    Infinix Hot 50 vs itel Color Pro: పెర్ఫామెన్స్

    ఇన్ఫినిక్స్ హాట్ 50 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఇచ్చారు. ఐటెల్ కలర్ ప్రో లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు. రెండు ప్రాసెసర్స్ లో డైమెన్సిటీ 6300 చిప్ మెరుగైనది.

    బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 మీడియాటెక్ డైమెన్సిటీ 6080
    అంటుటు 4,33,932 4,32,270
    గీక్‌బెంచ్ (సింగిల్ కోర్) 781 పాయింట్లు 752 పాయింట్లు
    గీక్‌బెంచ్ (మల్టీ-కోర్) 1,981 పాయింట్లు 2,081 పాయింట్లు

     

    రెండు ఫోన్ల యొక్క బెంచ్‌మార్క్ ఫలితాలను పరిశీలిస్తే, కలర్ ప్రో అంటుటు స్కోర్ 4,32,270 పాయింట్లుగా ఉంది. గీక్‌బెంచ్ సింగిల్-కోర్ పై 752 పాయింట్లు, మల్టీ-కోర్ పై 2081 పాయింట్లు నమోదు చేసింది. మరోవైపు, హాట్ 50 యొక్క అంటుటు స్కోర్ 4,33,932 పాయింట్లుగా ఉంది. గీక్‌బెంచ్‌పై సింగిల్-కోర్ టెస్ట్ లో 781 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1981 పాయింట్లు నమోదు చేసింది.

    Infinix Hot 50 vs itel Color Pro: కెమెరాలు

    రెండు ఫోన్ల యొక్క కెమెరా విభాగాన్ని పరిశీలిస్తే, కలర్ ప్రో డివైజ్ బెటర్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. హాట్ 50 లో 48ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ లెన్స్ ఉన్నాయి. కలర్ ప్రో లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి.

    ఐటెల్ కలర్ ప్రో యొక్క కెమెరా పెర్ఫామెన్స్, ప్రత్యేకించి లో-లైట్ కండీషన్స్ లో బాగుంది.

    Infinix Hot 50 vs itel Color Pro: బ్యాటరీ, చార్జింగ్

    ఇన్పినిక్స్ హాట్ 50 మరియు ఐటెల్ కలర్ ప్రో ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. రెండు ఫోన్లు డీసెంట్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తాయి. కానీ, స్లోగా చార్జ్ అవుతాయి. మేం జరిపిన పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఐటెల్ కలర్ ప్రో 12 గంటల 38 నిమిషాల పాటు పనిచేసింది. 20 శాతం నుంచి 100 శాతం వరకు చార్జ్ అయ్యేందుకు 1 గంటా 41 నిమిషాల సమయం పట్టింది. ఇన్ఫినిక్స్ హాట్ 50 కూడా దాదాపుగా ఇదే స్థాయి స్కోర్ చేసింది.

    Infinix Hot 50 vs itel Color Pro: సాఫ్ట్‌వేర్

    ఇన్ఫినిక్స్ హాట్ 50 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది. కలర్ ప్రో డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఐటెల్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండు ఫోన్లకు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. అయితే ఓఎస్ అప్డేట్స్ మాత్రం లభించకపోవచ్చు. అయితే ఇన్ఫినిక్స్ హాట్ 50 లో ఏఐ ఫీచర్లు, ఫోటోగ్రఫీ ఫీచర్లు ఉన్నాయి. కలర్ ప్రో లో ఇవేవీ లేవు.

    ఏది బెటర్?

    మీరు ఏ ఫోన్ ఎంపిక చేసుకున్నప్పటికీ, రెండు ఫోన్లు కూడా అన్ని విభాగాల్లో బాగానే పెర్ఫామ్ చేస్తాయి. అయితే, రెండింట్లో ప్లస్‌లు, మైనస్‌లు ఉన్నాయి. ఇక ఛాయిస్ అనేది, మీ వ్యక్తిగత అభిరుచిపై ఆధారపడి ఉంటుంది.

    మీరు గనుక లెదర్ బ్యాక్, ఐపీ54 ప్రొటెక్షన్, స్మూథ్ డిస్ప్లే, అప్-టు-డేట్ సాఫ్ట్‌వేర్, సుపీరియర్ పెర్ఫామెన్స్ కోరుకుంటే, Infinix Hot 50 బెటర్. అయితే, మీరు కలర్ షిఫ్టింగ్ డిజైన్, బెటర్ కెమెరా సెటప్, ఎక్కువ ర్యామ్, తక్కువ ధర వంటివి కావాలంటే అప్పుడు itel Color Pro మీకు బెటర్ ఆప్షన్.