
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి ఏప్రిల్ నెలలో Realme P1 Pro 5G అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోన్ పై ఎక్స్‌చేంజ్ ఆఫర్లతో పాటు, డిస్కౌంట్స్ మరియు బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ పై లభిస్తోన్న ఆఫర్ వివరాలను మరియు డివైజ్ స్పెసిఫికేషన్స్‌ను ఇప్పుడు తెలుసుకుందాం.
Realme P1 Pro 5G ఆఫర్ వివరాలు
Realme P1 Pro 5G పై రూ.2,500 డిస్కౌంట్ పొందవచ్చు. డిస్కౌంట్ తర్వాత 8జిబి ర్యామ్ + 128జిబి వేరియంట్ ధర రూ.19,499 గా ఉంది.
మిడ్ మోడల్ 8జిబి + 256జిబి వేరియంట్ రూ.20,499 గా గా ఉంది. 12జిబి + 256జిబి మోడల్ ధర రూ.20,999 గా ఉంది.
బేస్ మరియు మిడ్ మోడల్స్ పై రూ.2,000 బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంది. టాప్ మోడల్ పై రూ.1,500 ప్రయోజనం పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
ఎక్స్‌చేంజ్ ఆఫర్ పై రూ.14,800 వరకు బెనిఫిట్ పొందవచ్చు. ఇది మీ పాత ఫోన్ కండీషన్ పై ఆధారపడి ఉంటుంది.
Realme P1 Pro 5G ఫీనిక్స్ రెడ్, పారట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Realme P1 Pro 5G స్పెసిఫికేషన్స్
స్క్రీన్: Realme P1 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ విజన్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
ప్రాసెసర్: Realme P1 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు. దీని హై క్లాక్ స్పీడ్ 2.2GHz. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ ఉపయోగించారు.
ర్యామ్, స్టోరేజీ: Realme P1 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ద్వారా గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ యూజర్ కి లభిస్తుంది. యూఎఫ్ఎస్ 3.1 టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.
ఓఎస్: Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కెమెరా: Realme P1 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ 600 ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ: Realme P1 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Realme P1 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, యూఎస్బీ 2.0, బ్లూటూత్ 5.2, వై-ఫై 6 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.











