
ఇన్ఫినిక్స్ సంస్థ మరొక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. Infinix Note 12i స్మార్ట్ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇదే హ్యాండ్సెంట్ 2022 సెప్టెంబర్ లో గ్లోబల్ మార్కెట్స్ లో లాంచైంది. Infinix Note 12i స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది.
Infinix Note 12i స్మార్ట్ ఫోన్ అమోలెడ్ డిస్ప్లే, వైడ్‌వైన్ ఎల్1 సర్టిఫికేషన్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ లెన్స్ తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. లేటెస్ట్ నోట్ సిరీస్ స్మార్ట్ ఫోన్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చింది. సరే, ఓసారి Infinix Note 12i యొక్క భారత మార్కెట్ ధర, లభ్యత, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.
భారత్ లో Infinix Note 12i ధర, లభ్యత
Infinix Note 12i స్మార్ట్ ఫోన్ 4జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.9,999 గా ఉంది. జనవరి 30 నుంచి ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకి అందుబాటులోకి వస్తుంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్స్ ప్రారంభమవుతాయి. ఇన్ఫినిక్స్, జియోతో కూడా జట్టుకట్టి యూజర్లకు ఒక ఆఫర్ ని అందిస్తోంది. ఫోన్ కొనుగోలు చేసిన 30 రోజుల లోపు కొనుగోలుదారులకు రూ.1,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
Infinix Note 12i స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
Infinix Note 12i స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ (2400*1080 పిక్సెల్స్) రెజుల్యూషన్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,00,000:1 కాంట్రాస్ట్ రేషియో ఉంటాయి. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తోంది.
Infinix Note 12i స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ52 జీపీయూ వాడారు. 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో ఫోన్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 512జిబి వరకు పెంచుకోవచ్చు. Infinix Note 12i ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Infinix Note 12i లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఒక క్యూవీజీఏ ఏఐ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి కెమెరా అందించారు.
Infinix Note 12i స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఇందులో టైప్-సీ పోర్ట్ ఉంటుంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఈ హ్యాండ్సెట్ స్టీరియో స్పీకర్, డీటీఎస్ ఆడియో సపోర్ట్ తో వస్తోంది. 3జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉంది.
Infinix Note 12i స్మార్ట్ ఫోన్ బ్లూ, ఫోర్స్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 164.43 మిల్లీ మీటర్ల పొడవు, 76.6 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.03 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది. డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











