
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా తాజాగా జీ-సిరీస్ లో కొన్ని స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. అలాగే ఈ సంస్థ ఎంట్రీ లెవెల్ ఫోన్ Moto E13 ని కూడా గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఎంట్రీ లెవెల్ ని టార్గెట్ చేస్తూ వస్తోన్న Moto E13 ఫోన్ యూనిసాక్ టీ606 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ (గో-ఎడిషన్) తో వచ్చింది.
ఎంట్రీ లెవెల్ ఫోన్ లేదా తక్కువ బడ్జెట్ లో ఫోన్ కొనాలని భావిస్తోన్న వారు Moto E13 ఫోన్ ని ప్రయత్నించవచ్చు. ఈ ఫోన్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 2జిబి/4జిబి ర్యామ్ ఆప్షన్స్, 64జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ (గో ఎడిషన్) తో వచ్చింది. సరే, Moto E13 యొక్క ధర, స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.
Moto E13 ధర, స్పెసిఫికేషన్స్
Moto E13 స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. ఈ ఫోన్ డిస్ప్లే ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ తో తయారైంది. ఈ ఫోన్ లో యూనిసాక్ టీ606 చిప్సెట్ వాడారు. 2జిబి/4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.
ఇప్పుడు Moto E13 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 13ఎంపి మెయిన్ కెమెరా మరియు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. Moto E13 ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో వచ్చింది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వచ్చింది.
Moto E13 ఫోన్ ఐపీ52 స్ప్లాష్ రెసిస్టన్స్ రేటింగ్ తో రావడం విశేషం. కాస్మిక్ బ్లాక్, అరోరా గ్రీన్, క్రీమీ వైట్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. 3.5ఎంఎం ఆడియో జాక్, డాల్బి అట్మాస్, డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ 164.19 మిల్లీ మీటర్ల పొడవు, 74.95 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.47 మిల్లీ మీటర్ల మందం, 179.5 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికా మార్కెట్స్ లో అందుబాటులోకి వస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











