6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో గ్లోబల్‌గా లాంచైన Infinix Note 30 సిరీస్

Highlights

  • గ్లోబల్ గా లాంచైన Infinix Note 30 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Note 30, Note 30 5G, Note 30 Pro
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చిన నోట్ 30 సిరీస్

ఇన్ఫినిక్స్ బ్రాండ్ తాజాగా నోట్ 30 సిరీస్ లో మూడు ఫోన్లను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో వచ్చిన Note 30, Note 30 5G, Note 30 Pro గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యాయి. ఇంకా భారత మార్కెట్ లాంచ్ తేదీ రివీల్ కాలేదు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లతో ఈ సిరీస్ మార్కెట్ లోకి వచ్చింది.

సరే, ఓసారి Infinix Note 30, Infinix Note 30 5G, Infinix Note 30 Pro స్మార్ట్ ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్, ధర, ఇతర వివరాలు తెలుసుకుందాం.

Infinix Note 30 స్పెసిఫికేషన్స్

  • 6.78-ఇంచ్ స్క్రీన్
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • హీలియో జీ99 చిప్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • 64ఎంపి ప్రైమరీ కెమెరా
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా

Infinix Note 30 స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ పంచ్-హోల్ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ వాడారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా అందించారు. Infinix Note 30 లో 64ఎంపి ఒమ్నీవిజన్ ఓవీ64బి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి.

Infinix Note 30 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఈ ఫోన్ లో ఉంది. ఈ ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, జేబీఎల్ స్పీకర్స్ ఉన్నాయి.

Infinix Note 30 5G స్పెసిఫికేషన్స్

  • డైమెన్సిటీ 6080 చిప్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • 6.78-ఇంచ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 108ఎంపి శాంసంగ్ ఐసోసెల్ కెమెరా

Infinix Note 30 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు. ఈ ఫోన్ 4జిబి/8జిబి ర్యామ్ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 6.78-ఇంచ్ పంచ్-హోల్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.

Infinix Note 30 5G లో 108ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎమ్6 మెయిన్ సెన్సర్, 2ఎంపి కెమెరా, ఒక ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి కెమెరా అందించారు. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Infinix Note 30 5G లో ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, జేబీఎల్ డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి.

Infinix Note 30 Pro స్పెసిఫికేషన్స్

  • హీలియో జీ99 చిప్
  • 8జిబి ర్యామ్
  • 108ఎంపి మెయిన్ కెమెరా
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా
  • 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

Infinix Note 30 Pro డివైజ్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 8జిబి ర్యామ్, 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ 4జీ కనెక్టివిటీతో వచ్చింది.