BMW-ఇన్‌స్పైర్డ్ డిజైన్‌తో గ్లోబల్‌గా లాంచైన Infinix Note 30 VIP Racing ఎడిషన్

Highlights

  • Infinix Note 30 VIP మాదిరి స్పెక్స్ కలిగిన రేసింగ్ ఎడిషన్
  • కస్టమైజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో వచ్చిన రేసింగ్ ఎడిషన్
  • భారత్‌లో రేసింగ్ ఎడిషన్ లభ్యతపై ఇంకా రాని క్లారిటీ

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix ఇటీవల లాంచ్ చేసిన Note 30 VIP కి ప్రత్యేక ఎడిషన్ ని తీసుకొచ్చింది. Infinix Note 30 VIP Racing ఎడిషన్ తాజాాగా గ్లోబల్ మార్కెట్ లోకి లాంచ్ అయ్యింది. అయితే భారతీయ మార్కెట్ లో ఈ రేసింగ్ ఎడిషన్ లభ్యతపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ రేసింగ్ ఎడిషన్ డివైజ్ కోసం ఇన్ఫినిక్స్ సంస్థ ప్రముఖ కార్ల కంపెనీ BMW తో జట్టుకట్టింది. సరే, ఓసారి ఈ రేసింగ్ ఎడిషన్ డిజైన్, స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Infinix Note 30 VIP Racing Edition ధర

  • కొత్తగా వచ్చిన Infinix Note 30 VIP Racing Edition డివైజ్ 315 యూఎస్ డాలర్ల (సుమారు రూ.26,162) ధరతో లాంచ్ అయ్యింది.
  • Infinix Note 30 VIP Racing Edition ఫోన్ ని కొనుగోలు చేసే వారికి ఎన్నో వీఐపీ అడ్వాంటేజెస్ లభిస్తాయి. ఇందులో పోస్ట్-పర్చేస్ అసిస్టెన్స్, ప్రయారిటీ రిపేర్ సర్వీసెస్, ప్రీమియమ్ పెర్క్స్ లభిస్తాయి.
  • Infinix Note 30 VIP Racing Edition డివైజ్ భారత మార్కెట్ లభ్యతపై ఇంకా క్లారిటీ రాలేదు.

Infinix Note 30 VIP Racing Edition డిజైన్

  • సరికొత్త నోట్ 30 VIP రేసింగ్ ఎడిషన్ స్ట్రీట్ రేసింగ్ నుండి దాని సూచనలను తీసుకుంటుందని Infinix తెలిపింది.
  • ఇది రాత్రి సమయంలో ప్రకాశవంతమైన రేసింగ్ కార్ల యొక్క వైబ్రెంట్ విజువల్స్‌ను సంగ్రహించడం లక్ష్యంగా పెట్టుకుంది. అవి డిజైన్ పరంగా ప్రత్యేకంగా నిలుస్తాయి.
  • ఫోన్ వెనుక ప్యానెల్ కంపెనీ ప్రకారం, వేగం, పనితీరు మరియు శక్తిని సూచించే బ్లాక్ లెదర్‌పై BMW యొక్క ట్రై-కలర్ లైట్ స్ట్రిప్‌తో 3D లైటింగ్ లెదర్ టెక్నాలజీని ప్రదర్శిస్తుంది.
  • స్మార్ట్‌ఫోన్ దాని డిజైన్‌లో మోటార్‌స్పోర్ట్ నుండి ప్రేరణ పొందిన అంశాలను కూడా కలిగి ఉందని ఇన్ఫినిక్స్ పేర్కొంది.

Infinix Note 30 VIP Racing Edition స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Infinix Note 30 VIP Racing Edition లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • చిప్సెట్: Infinix Note 30 VIP Racing Edition లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్ వాడారు.
  • కెమెరా: Infinix Note 30 VIP Racing Edition లో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి.
  • సెల్ఫీ కెమెరా: Infinix Note 30 VIP Racing Edition లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • స్టోరేజీ: Infinix Note 30 VIP Racing Edition లో 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. 2టిబి వరకు మెమొరీని ఎక్స్‌పాండ్ కూడా చేసుకోవచ్చు.
  • ఓఎస్: Infinix Note 30 VIP Racing Edition ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Infinix Note 30 VIP Racing Edition లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 68 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Infinix Note 30 VIP Racing Edition లో బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ, 5జీ, డ్యూయల్ 4జీ వొల్టీ తదితర ఆప్షన్స్ ఉన్నాయి.