
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola ఇటీవలె Moto Edge 40 Neo డివైజ్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. భారతీయ మార్కెట్ లో సెప్టెంబర్ 21 న లాంచ్ అవుతోంది. ఇప్పటికే కంపెనీ ఈ ఫోన్ యొక్క ఇండియన్ మార్కెట్ స్పెసిఫికేషన్స్ రివీల్ చేసింది. ఇప్పుడు Moto Edge 40 Neo ధర మాత్రమే తెలియాల్సి ఉంది. సరే, ఓసారి Moto Edge 40 Neo యొక్క ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Moto Edge 40 Neo స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Moto Edge 40 Neo లో 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 87.70% స్క్రీన్ టు బాడీ రేషియో, 20:9 యాస్పెక్ట్ రేషియో, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పీఓఎల్ఈడీ ఎల్ఈడీ ప్యానెల్ ఉంటాయి.
- ప్రాసెసర్: Moto Edge 40 Neo లో మీడియాటెక్ డైమెన్సిటీ 7030 చిప్ ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ610 ఎంసీ1 జీపీయూ వినియోగించారు.
- స్టోరేజీ, ర్యామ్: Moto Edge 40 Neo డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ తో వస్తోంది.
- కెమెరా: Moto Edge 40 Neo డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, సెకండరీ లెన్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి
- బ్యాటరీ: Moto Edge 40 Neo లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Moto Edge 40 Neo డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Moto Edge 40 Neo డివైజ్ లో డ్యూయల్ సిమ్ 5జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.
- ఇతర ఫీచర్లు: Moto Edge 40 Neo లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇది ఐపీ68 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.
Moto Edge 40 Neo ధర (అంచనా)
Moto Edge 40 Neo డివైజ్ ధరను ఇంకా కంపెనీ రివీల్ చేయలేదు. అయితే సెప్టెంబర్ 21 న లాంచ్ రోజున ధర తెలియనుంది. రూ.25,000 లోపే ధర ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక కలర్ ఆప్షన్స్ గురించి మాట్లాడితే, Moto Edge 40 Neo ఫోన్ కేనల్ బే, బ్యూటీ బ్లాక్, సూథింగ్ సీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.











