Infinix: గ్లోబల్ గా లాంచైన Infinix Note 40 4G, Note 40 Pro 4G

Highlights

  • Infinix Note 40 4జీ సిరీస్ గ్లోబల్ లాంచ్
  • లైనప్ లో వచ్చిన Note 40 4G, 40 Pro 4G
  • యాక్టివ్ హాలో ఎల్‌ఈడీ ఫీచర్‌తో వచ్చిన సిరీస్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix గ్లోబల్ గా Note 40 4జీ సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో Infinix Note 40 4G మరియు Infinix Note 40 Pro 4G ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. మంచి ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్లు యూజర్లను ఆకర్షించే అవకాశం ఉంది. యాక్టివ్ హాలో ఎల్ఈడీ ఫీచర్ ఈ ఫోన్లో ప్రధానాకర్షణగా నిలవనుంది. ఇంకా ఈ ఫోన్లు 108ఎంపి మెయిన్ కెమెరా, 70 వాట్ మరియు 20 వాట్ వైర్లెస్ చార్జింగ్ తో వచ్చింది. ఓసారి డివైజెస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Infinix Note 40, Note 40 Pro 4G ధరలు

Infinix Note 40 ధరను 199 డాలర్లు (సుమారు రూ.16,496) గా నిర్ణయించారు. Infinix Note 40 Pro 4G ధర 259 డాలర్లు (సుమారు రూ.21,470) గా ఉంది.

ఈ ఫోన్ల ధరల్లో దేశాన్ని బట్టి హెచ్చుతగ్గులు ఉండవచ్చు. మార్చి 19 అనగా, నేటి నుంచి ఈ ఫోన్లు విక్రయానికి అందుబాటులో ఉంటాయి. భారత్ లో ఈ ఫోన్లు ఎప్పుడు లాంచ్ అవుతాయో ఇంకా తెలియదు. త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Infinix Note 40 4G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Infinix Note 40 4G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్టీపీఎస్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 1080*2436 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 94% స్క్రీన్ టు బాడీ రేషియో, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డీసీఐ-పీ3 వైడ్ కలర్ గేముత్ ఉన్నాయి.
  • యాక్టివ్ హాలో: Infinix Note 40 4G లో యాక్టివ్ హాలో అనే కొత్త ఫీచర్ ని పరిచయం చేశారు. ఏఐ లైటింగ్ తో కూడిన ఈ ఫీచర్ ద్వారా యూజర్లు కాల్ లేదా ఇతర నోటిఫికేషన్ ని కెమెరా దగ్గర లైటింగ్ ఎఫెక్ట్ ద్వారా గమనించవచ్చు.
  • ప్రాసెసర్: Infinix Note 40 4G లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, మాలి జీ57 ఎంసీ2 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix Note 40 4G లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఉన్నాయి.
  • కెమెరా: Infinix Note 40 4G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, ఒక ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Infinix Note 40 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 20 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
  • ఓఎస్: Infinix Note 40 4G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Infinix Note 40 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, డ్యూయల్ స్పీకర్స్, ఐపీ54 స్ప్లాష్ ప్రూఫ్ రేటింగ్ ఉన్నాయి.

Infinix Note 40 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Infinix Note 40 Pro లో 6.78-ఇంచ్ ఎల్టీపీఎస్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (1080*2436 పిక్సెల్స్), 1300 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డీసీఐ-పీ3 వైడ్ కలర్ గేముత్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Infinix Note 40 Pro లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, మాలి జీ57 ఎంసీ2 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix Note 40 Pro 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 12జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది.
  • కెమెరా: Infinix Note 40 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Infinix Note 40 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 70 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 20 వాట్ వైర్లెస్ మ్యాగ్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Infinix Note 40 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Infinix Note 40 Pro లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, డ్యూయల్ స్పీకర్స్, ఐపీ54 స్ప్లాష్ ప్రూఫ్ రేటింగ్ ఉన్నాయి.
Previous articleInfinix: గ్లోబల్‌గా లాంచైన Note 40 Pro 5G, Note 40 Pro+ 5G
Next articleRealme: ఎయిర్‌ జెశ్చర్ ఫీచర్‌తో లాంచైన Narzo 70 Pro 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.