Realme: ఎయిర్‌ జెశ్చర్ ఫీచర్‌తో లాంచైన Narzo 70 Pro 5G

Highlights

  • భారత్ లో Narzo 70 Pro 5G లాంచ్
  • 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే
  • 2000 నిట్స్ బ్రైట్నెస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Narzo 70 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ లుక్ మరియు డిజైన్ ఇదివరకే సోషల్ మీడియా ద్వారా రివీల్ అయ్యాయి. ఈ డివైజ్ ధర రూ.20,000 లోపు ఉంటుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. Realme Narzo 70 Pro 5G ఫోన్ ఎయిర్ జెశ్చర్ అనే కొత్త ఫీచర్ తో వచ్చింది. ఇంకా ఈ ఫోన్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉన్నాయి. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme Narzo 70 Pro 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme Narzo 70 Pro 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 394పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100% పీ3 కలర్ గేముత్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme Narzo 70 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme Narzo 70 Pro 5G డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది. దీంతో కస్టమర్ కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • బ్యాటరీ: Realme Narzo 70 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Realme Narzo 70 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి.
  • ఎయిర్ జెశ్చర్: Realme Narzo 70 Pro 5G లో ఎయిర్ జెశ్చర్ అనే కొత్త ఫీచర్ ని అందించారు. దీని ద్వారా ఫోన్ స్క్రీన్‌ని తాకకుండానే ఆపరేట్ చేయవచ్చు.
  • కనెక్టివిటీ: Realme Narzo 70 Pro 5G లో డ్యూయల్ సిమ్, 4జీ, 5జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

Realme Narzo 70 Pro 5G ధర

Realme Narzo 70 Pro 5G రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.21,999 గా పెట్టారు.

Realme Narzo 70 Pro 5G డివైజ్ బేస్ మోడల్ పై లాంచ్ ఆఫర్ లో భాగంగా రూ.1,000, టాప్ మోడల్ పై రూ.2,000 డిస్కౌంట్ అందిస్తున్నారు. దీంతో యూజర్లకు 128జిబి స్టోరేజీ వేరియంట్ రూ.18,999 కే లభిస్తుంది. 256జిబి స్టోరేజీ మోడల్ రూ.19,999 కి లభిస్తుంది.

ఎర్లీబర్డ్ సేల్ నేడు సాయంత్రం 6 గంటల నుంచి మొదలవుతుంది. కంపెనీ వెబ్‌సైట్ మరియు అమెజాన్ ద్వారా ఈ ఫోన్‌ని బుక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2,299 విలువగల Realme Buds T300 ఇయర్ బడ్స్ ని రియల్మీ ఉచితంగా అందిస్తోంది.

Previous articleInfinix: గ్లోబల్ గా లాంచైన Infinix Note 40 4G, Note 40 Pro 4G
Next articleLava: మార్చి 22న లాంచ్ అవుతోన్న Lava O2
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.