
నోట్ 40 ఫ్యామిలీలో Infinix Note 40X ఐదో ఫోన్ గా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ప్రారంభ ధర రూ.14,999 గా ఉంది. ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ డీసెంట్ గా ఉన్నాయి. ఇదే సెగ్మెంట్ లో OPPO A3x అనే మరొక ఫోన్ లాంచ్ అయ్యింది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ కి ఒప్పో ఏ3ఎక్స్ బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పవచ్చు. ఈ ఆర్టికల్ లో మేం, ఈ రెండు ఫోన్లను పోల్చి చూసి ఏది వాల్యూ ఫర్ మనీ ఫోనో తెలుసుకుందాం.
Infinix Note 40X vs OPPO A3x: డిజైన్
Infinix Note 40X ప్లాస్టిక్ బాడీ, మ్యాట్ ఫినిషింగ్ కలిగి ఉంది. గ్రీన్, బ్లూ మరియు బ్లాక్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. రియర్ ప్యానెల్ పై బాటమ్ లో ఎడమ వైపున బ్రాండ్ లోగో ఉంది. బ్యాక్ ప్యానెల్ పై టాప్ లెఫ్ట్ కార్నర్ లో, స్క్వేర్ ఐల్యాండ్ లో ట్రిపుల్ కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఫ్రంట్ లో పంచ్ హోల్ కటౌట్ డిస్ప్లే ఉంది.
OPPO A3x డివైజ్ ప్లాస్టిక్ బాడీ, మ్యాట్ ఫినిషింగ్ కలిగి ఉంది. బ్లాక్, వైట్ మరియు పర్పుల్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ డివైజ్ మిలిటరీ గ్రేడ్ MIL-STD 810H సర్టిఫికేషన్ తో వచ్చింది. ఫ్రంట్ లో పంచ్ హోల్ డిస్ప్లే ఉంది.
Infinix Note 40X vs OPPO A3x: డిస్ప్లే
Infinix Note 40X డివైజ్ లో OPPO A3x కంటే మెరుగైన మరియు భారీ డిస్ప్లే ఉంది. రెండు ఫోన్లు కూడా ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చాయి. అయితే, Infinix Note 40X లో ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్ ఉండగా, OPPO A3x లో హెచ్డీ+ స్క్రీన్ ఉంది. నోట్ 40ఎక్స్ లో ఉన్న హయ్యర్ రెజుల్యూషన్, ఒప్పో ఏ3ఎక్స్ కంటే మెరుగైన, స్పష్టమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
Infinix Note 40X vs OPPO A3x: పెర్ఫామెన్స్
రెండు ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు. ఈ ప్రాసెసర్ పెర్ఫామెన్స్ పర్వాలేదనిపించేలా ఉంటుంది. కాబట్టి, రెండు ఫోన్ల యొక్క పనితీరు ఒకే విధంగా ఉంటుందని అంచనా వేయవచ్చు.
అయితే Infinix Note 40X 8జిబి మరియు 12జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. మరోవైపు OPPO A3x 4జిబి ర్యామ్ ని మాత్రమే ఆఫర్ చేస్తుంది. సాధారణ వాడకానికి కూడా 4జిబి ర్యామ్ సరిపోదు. మల్టీ టాస్కింగ్ లేదా యాప్స్ నడుమ మారేందుకు, యాప్స్ లోడ్ అయ్యేందుకు ఈ ర్యామ్ పవర్ సరిపోదు.
ఇదిలా ఉంచితే, రెండు ఫోన్లో స్టోరేజీని పెంచుకునే వీలుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. OPPO A3x 128జిబి స్టోరేజీతో వచ్చింది.
Infinix Note 40X vs OPPO A3x: కెమెరాలు
Infinix Note 40X లో ఒప్పో ఏ3ఎక్స్ తో పోల్చితే ఉత్తమమైన కెమెరా సెటప్ ఉంది. ఒప్పో ఏ3ఎక్స్ లో 8ఎంపి రియర్ కెమెరాను అందించారు. మరోవైపు నోట్ 40ఎక్స్ లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి.
ముందువైపు, Infinix Note 40X లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. OPPO A3x లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా మాత్రమే ఉంది. Infinix Note 40X లో ఏఐ కెమెరా, ఫోటో ఎడిటింగ్ ఫీచర్లు ఉన్నాయి.
Infinix Note 40X vs OPPO A3x: బ్యాటరీ, చార్జింగ్
బ్యాటరీ మరియు చార్జింగ్ విభాగంలో ఒప్పో ఏ3ఎక్స్ దే పైచేయి. ఈ ఫోన్ లో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. అలాగే 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. మరోవైపు Infinix Note 40X లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.
రెండు ఫోన్ల మధ్య 100ఎంఏహెచ్ బ్యాటరీ పెద్ద తేడా కాదని చెప్పవచ్చు. 45 వాట్ ఫాస్ట్ చార్జర్ ఒప్పో ఏ3ఎక్స్ ను త్వరగా చార్జ్ చేయగలదు. నోట్ 40ఎక్స్ లో అందించిన 18 వాట్ ఫాస్ట్ చార్జర్ నెమ్మదిగా చార్జ్ చేస్తుంది.
Infinix Note 40X vs OPPO A3x: సాఫ్ట్‌వేర్
ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ మరియు ఒప్పో ఏ3ఎక్స్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యాయి. ఒప్పో ఏ3ఎక్స్ కలర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ ఎక్స్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
ఏది బెటర్?
ఓవరాల్‌గా, స్పెసిఫికేషన్స్ ప్రకారం చూస్తే.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు డీసెంట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పవచ్చు. అలాగే రెండు ఫోన్లలో ప్లస్‌లు, మైనస్‌లు ఉన్నాయి. కాబట్టి, రెండింట్లో దేన్ని ఎంపిక చేసుకోవాలనేది యూజర్ వ్యక్తిగత నిర్ణయం.
మీకు గనుక, స్పష్టమైన డిస్ప్లే, ఎక్కువ ర్యామ్ కావాలంటే.. Infinix Note 40X ఎంచుకోండి. మీకు బ్యాటరీ లైఫ్ మరియు చార్జింగ్ స్పీడ్ ముఖ్యమైతే OPPO A3x ప్రయత్నించవచ్చు.