
స్మార్ట్ఫోన్ మేకర్ Infinix త్వరలోనే భారతీయ మార్కెట్ లో Infinix Smart 8 డివైజ్ ని లాంచ్ చేయనుంది. అయితే ఇప్పటి వరకు కంపెనీ నుంచి లాంచ్ ప్రకటన రాలేదు. కానీ, ఈలోపు Infinix Smart 8 డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్సైట్ పై కనిపించింది. అంతకు ముందు ఈ ఫోన్ గీక్బెంచ్ మరియు ఎఫ్సీసీ సర్టిఫికేషన్ వెబ్సైట్స్ పై కనిపించింది. సరే, ఓసారి Infinix Smart 8 యొక్క గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు, డిజైన్, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Infinix Smart 8 గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్
- లిస్టింగ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే, Infinix Smart 8 డివైజ్ హెచ్డీ+ స్క్రీన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
- డిస్ప్లే 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్ ని ఆఫర్ చేస్తుంది.
- Infinix Smart 8 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ ఉంటుంది.
- లిస్టింగ్ ద్వారా Infinix Smart 8 డివైజ్ 3జిబి ర్యామ్ తో వస్తున్నట్లు రివీల్ అయ్యింది.
- సాఫ్ట్వేర్ విషయానికి వస్తే, Infinix Smart 8 ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.
Infinix Smart 8 రెండర్స్ (గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్)
- గూగూల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై Infinix Smart 8 రెండర్ కనిపించింది.
- లిస్టింగ్ లో పంచ్-హోల్ డిస్ప్లేతో డివైజ్ కనిపించింది.
- వాల్యూమ్ మరియు పవర్ బటన్స్ ఫోన్ కి కుడివైపున కనిపించాయి.
- రెండర్ ద్వారా మరే ఇతర వివరాలు బయటకు రాలేదు.
Infinix Smart 8 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Infinix Smart 8 లో 6.5-ఇంచ్ లేదా 6.6-ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 720*1612 పిక్సెల్ రెజుల్యూషన్ ఉంటాయి.
- ప్రాసెసర్: Infinix Smart 8 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్ వాడనున్నట్లు సమాచారం.
- మెమొరీ: Infinix Smart 8 బేస్ మోడల్ 3జిబి ర్యామ్ తో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ ని కలిగి ఉంటుందని అంచనా.
- బ్యాటరీ: Infinix Smart 8 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Infinix Smart 8 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Infinix Smart 8 డివైజ్ లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
- డైమెన్షన్స్: Infinix Smart 8 డివైజ్ 164 మి.మీ పొడవు, 76 మి.మీ వెడల్పు, 9 మి.మీ మందం ఉంటుంది. ఎఫ్సీసీ లిస్టింగ్ ద్వారా ఈ వివరాలు తెలిసాయి.












