
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో తన ఫ్లాగ్షిప్ డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ కానుందని సమాచారం. ఇంకా ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ మార్కెటింగ్ పేరుని కంపెనీ వెల్లడించలేదు. కానీ, Realme GT 5 Pro అని అంతా భావిస్తున్నారు. ఇప్పుడు నెట్టింట్లో ఈ ఫోన్ ఇమేజెస్ ప్రత్యక్షమయ్యాయి. సర్టిఫికేషన్ వెబ్‌సైట్ TENAA ద్వారా Realme GT 5 Pro యొక్క ఇమేజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఇమేజెస్ తో టెలీఫోటో సెన్సర్ ని రియల్మీ తన అప్‌కమింగ్ ఫోన్ లో తీసుకొస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Realme GT 5 Pro డిజైన్
- Realme GT 5 Pro ఇమేజెస్ ద్వారా ఫోన్ లో సెంటర్-పంచ్ హోల్ కటౌట్ ఉన్నట్లు తెలుస్తోంది. కర్వ్డ్ ఎడ్జెస్, సన్నని బెజెల్స్ కనిపిస్తున్నాయి.
- Realme GT 5 Pro డివైజ్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. సైడ్ ఫ్రేమ్ మెటల్ తో తయారైనట్లు తెలుస్తోంది.
- బ్యాక్ ప్యానెల్ తెలుపు రంగులో కనిపిస్తోంది. ఇతర కలర్ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
- Realme GT 5 Pro లో బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో నాలుగు కెమెరా సెన్సర్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తున్నాయి.
Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Realme GT 5 Pro లో 1.5కే బీఓఈ అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Realme GT 5 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించినట్లు తెలుస్తోంది.
- మెమొరీ: Realme GT 5 Pro లో 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
- కెమెరా: Realme GT 5 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్966 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి ఓవీ64బి ఓఐఎస్ 3x జూమ్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి.
- బ్యాటరీ: Realme GT 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Realme GT 5 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.











