
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme GT 5 Pro ని లాంచ్ చేయనుంది. Realme GT 5 Pro డివైజ్ పెరిస్కోప్ లెన్స్ తో వస్తోన్న రియల్మీ యొక్క మొదటి ఫోన్. రీసెంట్ గా రియల్మీ సంస్థ చైనాలో ఒక కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో సదరు సంస్థ Realme GT 5 Pro డివైజ్ కలిగి ఉన్న పెరిస్కోప్ టెలీఫోటో సెన్సర్ విశేషాలను పంచుకుంది. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.
మిడ్-రేంజ్ బడ్జెట్ లో వస్తోన్న Realme GT 5 Pro డివైజ్ పెరిస్కోప్ లెన్స్ తో వస్తున్నట్లు రియల్మీ కన్ఫర్మ్ చేసింది. ఇకపోతే ఇప్పటికే Realme GT 5 Pro డివైజ్ చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ సైట్ లో లిస్ట్ అయ్యింది. 3సీ లిస్టింగ్ ద్వారా ఫాస్ట్ చార్జింగ్ వివరాలు తెలిసాయి. ఇక గీక్‌బెంచ్ ద్వారా Realme GT 5 Pro డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో రానున్నట్లు తెలిసింది. తాజాగా రియల్మీ సంస్థ చైనాకు చెందిన సామాజిక మాధ్యమం వీబో పై కొత్త టీజర్ షేర్ చేసింది. దీని ద్వారా లాంచ్ తేదీ రివీల్ అయ్యింది.
Realme GT 5 Pro లాంచ్ తేదీ
Realme GT 5 Pro డివైజ్ చైనాలో డిసెంబర్ 7 వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ అవుతోంది. పెరిస్కోప్ సెన్సర్ తో Realme GT 5 Pro డివైజ్ వస్తున్నట్లు రియల్మీ కన్ఫర్మ్ చేసింది. పెరిస్కోప్ లెన్స్ జూమ్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. రానున్న రోజుల్లో జేడి.కామ్ ఈ ఫోన్ ప్రీ-బుకింగ్ చేసుకునే అవకాశం ఉండవచ్చు.
Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Realme GT 5 Pro లో 6.82-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Realme GT 5 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ వాడనున్నారు.
- ర్యామ్, స్టోరేజీ: Realme GT 5 Pro డివైజ్ 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- రియర్ కెమెరా: Realme GT 5 Pro లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి.
- బ్యాటరీ: Realme GT 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ వైర్ల్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ తో రానుంది.
- సెక్యూరిటీ: Realme GT 5 Pro లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించనున్నారు.
- సాఫ్ట్‌వేర్: Realme GT 5 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.












