జనవరి 13న భారత్‌లో లాంచ్ అవుతోన్న Infinix Smart 8

Highlights

  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి రానున్న Infinix Smart 8
  • మైక్రోసైట్ ద్వారా రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్
  • Infinix Smart 8 ప్రారంభ ధర రూ.6,000 ఉండే అవకాశం

Infinix బ్రాండ్ త్వరలోనే Smart 8 స్మార్ట్‌ఫోన్‌ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ నైజీరియాలో నవంబర్ 2023 లో లాంచ్ అయ్యింది. ఇండియా లాంచ్ కి సంబంధించిన టీజర్లను కంపెనీ షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా, ఫ్లిప్‌కార్ట్ లో మైక్రోసైట్ ప్రత్యక్షమైంది. దీని ద్వారా Infinix Smart 8 యొక్క లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. Infinix Smart 8 డివైజ్ భారతీయ మార్కెట్ లో జనవరి 13 న లాంచ్ అవుతోందని లిస్టింగ్ ద్వారా ఖరారైంది. సరే, ఓసారి ధర శ్రేణి, ఖరారైన స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Infinix Smart 8 లాంచ్ తేదీ, ధర శ్రేణి, ఖరారైన స్పెసిఫికేషన్స్

  • ఫ్లిప్‌కార్ట్ మైక్రో-సైట్ ద్వారా Infinix Smart 8 స్మార్ట్‌ఫోన్ జనవరి 13న భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతుందని ఖరారైంది. మధ్యాహ్నం 12 గంటలకు డివైజ్ లాంచ్ అవ్వనుంది.
  • Infinix Smart 8 డివైజ్ యొక్క 4జిబి+64జిబి వేరియంట్ ధర రూ.6,000 వద్ద ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • Infinix Smart 8 డివైజ్ 4జిబి వర్చువల్ ర్యామ్, 6.6-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ప్రైమరీ కెమెరాతో వస్తున్నట్లు సమాచారం.
  • ఓసారి Infinix Smart 8 గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Infinix Smart 8 స్పెసిఫికేషన్స్ (గ్లోబల్ వేరియంట్)

  • డిస్ప్లే: Infinix Smart 8 లో 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 90 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 500 నిట్స్ బ్రైట్నెస్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
  • చిప్సెట్: Infinix Smart 8 లో యూనిఎస్ఓసీ టీ606 ప్రాసెసర్, ఏఆర్ఎమ్ మాలి-జీ57 ఎంపీ1 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix Smart 8 డివైజ్ 3జిబి/4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ, 4జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 2టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • సాఫ్ట్‌వేర్: Infinix Smart 8 డివైజ్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఓఎస్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Infinix Smart 8 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్, రింగ్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Infinix Smart 8 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • బరువు, చుట్టుకొలత: Infinix Smart 8 లో 163.60 మి.మీ పొడవు, 75.60 మి.మీ వెడల్పు, 8.5 మి.మీ మందం, 184 గ్రాముల బరువు ఉంటుంది.
  • సెక్యూరిటీ: Infinix Smart 8 లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఇచ్చారు.
  • కనెక్టివిటీ: Infinix Smart 8 లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.0, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి.
  • కలర్స్: Infinix Smart 8 డివైజ్ టింబర్ బ్లాక్, షైనీ గోల్డ్, క్రిస్టల్ గ్రీన్ మరియు గెలాక్సీ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.