
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO చైనీస్ మార్కెట్ లో OPPO Find X7 సిరీస్‌ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో OPPO Find X7 మరియు OPPO Find X7 Ultra ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. OPPO Find X7 సిరీస్ లో హాజల్‌బ్లడ్ ట్యూన్డ్ కెమెరా సెన్సర్స్ ని వాడారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి OPPO Find X7 మరియు OPPO Find X7 Ultra డివైజెస్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
OPPO Find X7, OPPO Find X7 Ultra ధరలు, కలర్ ఆప్షన్స్
- OPPO Find X7 12జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర RMB 3,999 (సుమారు రూ.47,500) గా ఉంది.
- OPPO Find X7 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర RMB 4,299 (సుమారు రూ.51,100) గా ఉంది.
- OPPO Find X7 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర RMB 4,599 (సుమారు రూ.54,600) గా ఉంది.
- OPPO Find X7 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ మోడల్ ధర RMB 4,999 (సుమారు రూ.59,400) గా ఉంది.
- OPPO Find X7 డివైజ్ స్మోకీ పర్పుల్, స్టారీ స్కై బ్లాక్, డెజర్ట్ సిల్వర్ మూన్ మరియు సీ వాస్ట్ స్కై కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- OPPO Find X7 Ultra 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ RMB 6,499 (సుమారు రూ.77,200) గా ఉంది.
- OPPO Find X7 Ultra 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ RMB 6,999 (సుమారు రూ.83,100) గా ఉంది.
- OPPO Find X7 Ultra సిల్వర్ మూన్, ద సీ అండ్ స్కై, స్మోకీ పర్పుల్ మరియు స్టారీ స్కై బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- OPPO Find X7 సిరీస్ సేల్ జనవరి 12 నుంచి చైనాలో మొదలవుతుంది.
OPPO Find X7 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OPPO Find X7 లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 10-బిట్ ప్యానెల్, ఎల్టీపీవో 1-120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 450 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.
- ప్రాసెసర్: OPPO Find X7 లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, ఏఆర్ఎమ్ ఇమ్మోర్టాలిస్ ఎంపీ12 జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: OPPO Find X7 డివైజ్ 12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి/1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- సాఫ్ట్‌వేర్: OPPO Find X7 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: OPPO Find X7 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో ఓఐఎస్ లెన్స్ ఉన్నాయి.
- బ్యాటరీ, చార్జింగ్: OPPO Find X7 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ సూపర్‌వూక్ వైర్డ్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
OPPO Find X7 Ultra స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OPPO Find X7 Ultra లో 6.82-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, క్యూహెచ్డీ+ (3168*1440 పిక్సెల్స్) రెజుల్యూషన్, ఎల్టీపీవో 1-120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డీసీఐ-పీ3 కలర్ గేముత్, 94.2 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1600 నిట్స్ స్టాండర్డ్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, 240హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 10 బిట్ ప్యానెల్, 450 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.
- ప్రాసెసర్: OPPO Find X7 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: OPPO Find X7 Ultra లో 12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.
- సాఫ్ట్‌వేర్: OPPO Find X7 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- రియర్ కెమెరా: OPPO Find X7 Ultra లో 50ఎంపి సోని ఎల్‌వైటీ900 ప్రైమరీ ఓఐఎస్ 1-ఇంచ్ లెన్స్, 50ఎంపి సోని ఎల్‌వైటీ 600 అల్ట్రావైడ్ ఓఐఎస్ లెన్స్, 50ఎంపి సోని ఐఎంఎక్స్890 పెరిస్కోప్ టెలీఫోటో 3x ఓఐఎస్ లెన్స్, 50ఎంపి సోని ఐఎంఎక్స్858 పెరిస్కోప్ టెలీఫోటో 6x లెన్స్ ఉన్నాయి.
- ఫ్రంట్ కెమెరా: OPPO Find X7 Ultra లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ, చార్జింగ్: OPPO Find X7 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ సూపర్‌వూక్ వైర్డ్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
- బరువు, చుట్టుకొలత: OPPO Find X7 Ultra డివైజ్ 164.3 మి.మీ పొడవు, 76.2 మి.మీ వెడల్పు, 9.5 మి.మీ మందం, 221 గ్రాముల బరువు ఉంటుంది.
- ఇతర ఫీచర్లు: OPPO Find X7 Ultra లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ 2.0, వై-ఫై 7, కలర్ టెంపరేచర్ సెన్సర్, బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్లు ఉన్నాయి.











