8GB ర్యామ్, 3D కర్వ్డ్ స్క్రీన్‌తో గ్లోబల్‌గా లాంచైన Infinix Zero 30 4G

Highlights

  • ఇండోనేషియాలో లాంచైన Infinix Zero 30 4G
  • 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన డివైజ్
  • Infinix Zero 30 4G ధర IDR 2,899,000 (రూ.15,100)

టెక్ బ్రాండ్ Infinix ఇండోనేషియాలో Infinix Zero 30 4G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో వచ్చింది. 50ఎంపి సెల్ఫీ కెమెరా, 108ఎంపి రియర్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Infinix Zero 30 4G కి సంబంధించిన ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Infinix Zero 30 4G ధర

  • Infinix Zero 30 4G స్మార్ట్‌ఫోన్ ఇండోనేషియాలో సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది.
  • ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వచ్చింది. దీని ధర IDR 2,899,000 గా ఉంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.15,100 అని అనుకోవచ్చు.
  • ఇండోనేషియాలో Infinix Zero 30 4G డివైజ్ సన్‌సెట్ గోల్డ్, మిస్టీ గ్రీన్ మరియు పెర్ల్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Infinix Zero 30 4G ఇండియా లాంచ్ గురించి ఇంకా ఏ సమాచారం లేదు.

Infinix Zero 30 4G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Infinix Zero 30 4G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Infinix Zero 30 4G లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ వాడారు.
  • ఓఎస్: Infinix Zero 30 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Infinix Zero 30 4G డివైజ్ లో 8జిబి ఫిజికల్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. దీంతో యూజర్ కి మొత్తం 16జిబి వరకు ర్యామ్ పవర్ లభించనుంది.
  • కెమెరా: Infinix Zero 30 4G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Infinix Zero 30 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.