
షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో టెక్ మార్కెట్ లో Redmi 13C డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా లాంచ్ కి ముందు Redmi 13C యొక్క రిటైల్ బాక్స్ లీక్ అయ్యింది. దీంతో Redmi 13C డివైజ్ డిజైన్, ధర, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Redmi 13C విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
Redmi 13C రిటైల్ బాక్స్ (లీక్)
- Redmi 13C స్మార్ట్‌ఫోన్ రెడ్ మరియు వైట్ కలర్ బాక్స్ ప్యాకేజీలో ఉంది. ఇది 4జీ మోడల్.
- Redmi 13C బ్రాండింగ్ ని బాక్స్ పైన చూడవచ్చు.
- అలాగే బాక్స్ పై 6.71-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అని రాసి ఉంది.
- Redmi 13C డివైజ్ బ్లాక్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. బ్యాక్ ప్యానెల్ టెక్షర్ ఫినిష్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
- ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, రెండు రౌండ్ కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ బ్యాక్ ప్యానెల్ పై కనిపిస్తున్నాయి. ఇంకా 50ఎంపి కెమెరా టెక్స్ట్ బ్రాండింగ్ ఉంది.
Redmi 13C స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Redmi 13C లో 6.71-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- మెమొరీ: Redmi 13C లో 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఉంటాయి.
- కెమెరా: Redmi 13C లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Redmi 13C డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
- ఓఎస్: Redmi 13C డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Redmi 13C లాంచ్ టైమ్‌లైన్, ధర (అంచనా)
- Redmi 13C డివైజ్ లాంచ్ తేదీ ఇంకా రివీల్ కాలేదు. కానీ, రిపోర్ట్స్ గనుక నిజమైతే, Redmi 13C 2023 నవంబర్ లో లాంచ్ అవుతుంది.
- Redmi 13C ఫోన్ ధర 100 డాలర్లు ఉంటుందని అంచనా. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.8,500 గా ఉండవచ్చు.












