
Vivo సంస్థ త్వరలోనే భారతీయ మార్కెట్ లో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో భాగంగా తొలుత Vivo V29e డివైజ్ మార్కెటల్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. గతంలో కూడా వివో కంపెనీ ఇదే స్ట్రేటజీని ఫాలో అయ్యింది. Vivo V29e లాంచ్ అయిన తర్వాత టాప్ మోడల్స్ లాంచ్ కానున్నాయి. వివో తాజాగా Vivo V29e యొక్క ఇమేజ్ ని షేర్ చేస్తూ.. త్వరలోనే డివైజ్ లాంచ్ కానుందని టీజ్ చేసింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Vivo V29e డిజైన్, కెమెరా వివరాలు
డెడికేటెడ్ మైక్రోసైట్ లో వివో కంపెనీ Vivo V29e ఫోన్ యొక్క యాంగిల్స్ ని ప్రజెంట్ చేసింది. ది మాస్టర్ పీస్ అనే ట్యాగ్ లైన్ తో ఫోన్ కనిపించింది. ఫోకస్ ప్రధానంగా డిజైన్ పై ఉన్నట్లు తెలుస్తోంది. వివో ఈసారి “స్లిమ్, స్లీక్, లైట్” బాడీని ప్రామిస్ చేస్తుంది. Vivo V29e డివైజ్ ఐ-క్యాచింగ్ కలర్స్ లో అందుబాటులో లభించనుంది.
ఈవారం మొదట్లో Vivo V29e యొక్క రెండర్స్ లీక్ ద్వారా రివీల్ అయ్యాయి. దీంతో కెమెరా స్పెసిఫికేషన్స్, ధర రేంజ్ తెలిసాయి. ఈ స్మార్ట్ ఫోన్ 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇక రియర్ కెమెరా విషయానికి వస్తే, 64ఎంపి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) కెమెరా ఉంటుంది. ఈ కెమెరా వెడ్డింగ్ పొట్రెయిట్ ఫీచర్ తో వస్తోంది.
భారత్ లో Vivo V29e ధర (అంచనా)
Vivo V29e స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ధర రూ.30,000 నుంచి ప్రారంభం అవుతుంది. గీక్ బెంచ్ టెస్ట్స్ ప్రకారం, Vivo V29e స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 480 లేదా స్నాప్ డ్రాగన్ 480+ చిప్సెట్ కలిగి ఉంటుందని సమాచారం. ఇప్పటి వరకు Vivo V29e గురించి తెలిసిన వివరాలు ఇవే.











