
Infinix సంస్థ భారత్ లో రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. అవి: Infinix Zero 5G 2023, Infinix Zero 5G 2023 Turbo. ఈ రెండు ఫోన్లు కూడా రూ.20,000 లోపు ధరతో మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Infinix Zero 5G 2023 Turbo స్మార్ట్ ఫోన్ గురించి తెలుసుకుందాం.
Infinix Zero 5G 2023 Turbo స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ తో వచ్చింది. ఈ ఫోన్ Kang the Conqueror థీమ్డ్ బాక్స్ తో వస్తుంది. అలాగే కొనుగోలుదారుడికి బాక్స్ లో గూడీస్ కూడా లభిస్తాయి. ఈ డివైజ్ 5000mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. సరే, ఓసారి Infinix Zero 5G 2023 Turbo స్మార్ట్ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
భారత్ లో Infinix Zero 5G 2023 Turbo ధర, లభ్యత
భారత్ లో Infinix Zero 5G 2023 Turbo స్మార్ట్ ఫోన్ ధర రూ.19,999 గా ఉంది. ఫిబ్రవరి 11 నుంచి ఈ డివైజ్ సేల్ కి వస్తోంది. కోరల్ ఆరెంజ్, పర్లీ వైట్, సబ్‌మరైనర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఆరెంజ్ స్పెషల్ వేరియంట్ వీగర్ లెదర్ ఫినిషింగ్ తో వస్తోంది.
Infinix Zero 5G 2023 Turbo స్పెసిఫికేషన్స్
Infinix Zero 5G 2023 Turbo స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ అందించారు. 5జిబి వర్చువల్ ర్యామ్ ఆప్షన్ కూడా ఈ ఫోన్ లో ఉంది. అంటే మొత్తంగా యూజర్ కి 13జిబి ర్యామ్ లభించనుంది. ఈ డివైజ్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
Infinix Zero 5G 2023 Turbo కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం Infinix Zero 5G 2023 Turbo లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
Infinix Zero 5G 2023 Turbo స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. Infinix Zero 5G 2023 Turbo డివైజ్ 199 గ్రాముల బరువు, 8.9 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. కోరల్ ఆరెంజ్, పర్లీ వైట్, సబ్‌మరైన్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
Infinix Zero 5G 2023 Turbo లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. 3.5ఎంఎం ఆడియో జాక్, స్టీరియో స్పీకర్స్, హై-రెజ్ ఆడియో, వై-ఫై 6, బ్లూటూత్ 5.1, జీపీఎస్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ డివైజ్ Kang the Conqueror థీమ్డ్ బాక్స్ మరియు గుడీస్ తో వస్తోంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











