హైలైట్స్:
- 200ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్, కర్వ్డ్ డిస్ప్లే తో రానున్న Infinix Zero Ultra 5G
- Infinix Zero Ultra 5G అక్టోబర్ 5 న లాంచ్ అవుతుందని సమాచారం
- న్యూజ్‌ఓన్లీ వెబ్ సైట్, టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ద్వారా రివీల్ అయిన స్పెసిఫికేషన్స్, లైవ్ ఇమేజెస్
ఇన్ఫినిక్స్ కంపెనీ త్వరలోనే కొత్త ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 5 న సదరు కంపెనీ ఒక ఈవెంట్ ని ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇదే ఈవెంట్ లో Infinix Zero Ultra 5G ఫోన్ ని ఇన్ఫినిక్స్ లాంచ్ చేయనుందని టాక్. ఈలోపు NewsOnly వెబ్‌సైట్, టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ల ద్వారా Infinix Zero Ultra 5G కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, లైవ్ ఇమేజెస్ రివీల్ అయ్యాయి.
Infinix Zero Ultra 5G 200ఎంపి కెమెరా సెన్సర్ తో వస్తున్నట్లు రిపోర్ట్ స్పష్టం చేసింది. అయితే ధర వివరాలు ఇంకా తెలియలేదు. 200ఎంపి మెయిన్ కెమెరా కలిగిన అత్యంత సరసమైన ధరలో లభించే ఫోన్ గా Infinix Zero Ultra 5G నిలవనుంది. మరి Infinix Zero Ultra 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఇతర వివరాలను గురించి తెలుసుకుందాం పదండి.
Infinix Zero Ultra 5G లైవ్ ఇమేజెస్, స్పెసిఫికేషన్స్
అక్టోబర్ 5 న Infinix Zero Ultra 5G ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీపావళి పండుగ సందర్బంగా ఈ ఫోన్ భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు లాంచ్ కి ముందు, ఈ ఫోన్ యొక్క లైవ్ ఇమేజెస్ ని ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని రివీల్ చేశాడు. Infinix Zero Ultra 5G కర్వ్డ్ డిస్ప్లే కలిగి ఉందని లీకైన ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ సెంటర్ పంచ్-హోల్ డిస్ప్లే తో వస్తోంది.
లైవ్ ఇమేజెస్, రెండర్స్ ని బట్టి చూస్తే, ఈ ఫోన్ వైట్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుందని అర్థమవుతోంది. బ్లాక్ కలర్ మోడల్ డ్యూయల్-టోన్ ఫినిష్ ని కలిగి ఉండనుంది. ఫోన్ వెనకాల ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది.
Infinix Zero Ultra 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
Infinix Zero Ultra 5G మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్సెట్ ని కలిగి ఉంటుందని సమాచారం. అలాగే 8జిబి, 12జిబి ర్యామ్ ఆప్షన్స్, 256జిబి స్టోరేజీ తో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. ఈ ఫోన్లో వర్చువల్ ర్యామ్ ఆప్షన్ ఉంది. వర్చువల్ ర్యామ్ ద్వారా 3జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే అవకాశం ఉంది. ఇకపోతే బ్యాటరీ గురించి మాట్లాడితే, Infinix Zero Ultra 5G లో 5000ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 180 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనుండటం విశేషం.
Infinix Zero Ultra 5G లో హైలైట్ పాయింట్ ఏంటంటే అది 200ఎంపి మెయిన్ కెమెరా. దీంతో పాటు 8ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఇందులో ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపున 32ఎంపి కెమెరాను అమర్చారు. Infinix Zero Ultra 5G ఆండ్రాయిడ్ 12 ఓఎస్, XOS కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.












