Helio A22 చిప్, 5000mAh బ్యాటరీతో వస్తున్న Redmi A1+

హైలైట్స్:

  • లీకైన Redmi A1+ ఇమేజెస్, స్పెసిఫికేషన్స్
  • ఏ-సిరీస్ లో మరొక ఫోన్ ని లాంచ్ చేయబోతున్న Redmi కంపెనీ
  • ఇప్పటికే FCC, Google Play Console పై కనిపించిన Redmi A1+

ఈ నెల మొదట్లో షావోమీ కంపెనీ రెడ్మీ ఏ1 స్మార్ట్ ఫోన్ ని భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు ఏ-సిరీస్ లో Redmi A1+ అనే స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయాలని సదరు కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే Redmi A1+ ఫోన్ FCC, Google Play Console వెబ్ సైట్స్ పై కనిపించింది. Redmi A1 మాదిరి స్పెసిఫికేషన్స్ నే Redmi A1+ కలిగి ఉంటుందని కాకపోతే ఫింగర్ ప్రింట్ స్కానర్ అదనంగా జత చేరుతోందని ఎఫ్‌సీసీ లిస్టింగ్ ద్వారా తెలిసింది.

ఇప్పుడు మరొక విషయం ఏంటంటే, తాజాగా Redmi A1+ యొక్క రెండర్స్, కలర్ ఆప్షన్స్, స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. Appuals, సుదాన్శు అంబోరే ల సౌజన్యంతో ఇవి బయటకు వచ్చాయి. లీకైన Redmi A1+ రెండర్స్ ని బట్టి, ఈ ఫోన్ డిజైన్ Redmi A1 మాదిరే ఉండనుందని స్పష్టమైంది. Redmi A1+ లో వచ్చిన ఏకైక మార్పు ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై మౌంట్ చేయబడిన ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఓసారి Redmi A1+ రెండర్స్, కలర్ ఆప్షన్స్, స్పెసిఫికేషన్స్ పై కన్నేద్దాం పదండి.

Redmi A1+: రెండర్స్, కలర్ ఆప్షన్స్

 

లీకైన రెండర్స్ ద్వారా Redmi A1+ మూడు కలర్ ఆప్షన్స్ లో లభించనుందని తెలుస్తోంది. అవి: పేస్టెల్ బ్లూ, పేస్టెల్ గ్రీన్, బ్లాక్. మూడు ఫోన్లు కూడా లెదర్ టెక్షర్ తో కూడిన బ్యాక్ ప్యానెల్ ని కలిగి ఉన్నాయి. Redmi A1 లో కూడా ఇదే విధమైన బ్యాక్ ప్యానెల్ డిజైన్ ని మనం గమనించవచ్చు.

ఇక అప్పీరియన్స్ విషయానికి వస్తే, Redmi A1+ అచ్చంగా Redmi A1 మాదిరే కనిపిస్తోంది. అయితే ఒకే ఒక్క తేడా ఏంటంటే, Redmi A1+ లో రియర్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది.

Redmi A1+ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

త్వరలో లాంచ్ కానున్న రెడ్మీ స్మార్ట్ ఫోన్ Redmi A1+ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం. ఈ ఫోన్లో 6.52-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 400 నిట్స్ బ్రైట్నెస్, స్క్రాచ్ రెస్టిస్టెన్స్ గ్లాస్ ఉన్నాయి. ఈ ఫోన్లో మీడియాటెక్ కంపెనీ తయారు చేసిన హీలియో ఏ22 చిప్సెట్ వాడారు. 2జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ ఈ ఫోన్లో ఉంది. ఇంకా Redmi A1+ ఆండ్రాయిడ్ 12 గో-ఎడిషన్ పై పని చేస్తుంది.

ఇప్పుడు Redmi A1+ కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి ప్రధాన కెమెరా, సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 5ఎంపి కెమెరాను వాటర్ డ్రాప్ నాచ్ లో అమర్చారు. Redmi A1+ లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ని నిక్షిప్తం చేశారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

Redmi A1+ లో భద్రత కోసం రియర్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. ఇక ఈ ఫోన్లో మైక్రో-యూఎస్బీ చార్జింగ్ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Previous articleలాంచ్ కి ముందు లీకైన Google Pixel 7, Pixel 7 Pro ధరలు
Next article200MP కెమెరా, కర్వ్డ్ డిస్ప్లే తో వస్తోన్న Infinix Zero Ultra 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.