
తక్కువ సమయంలోనే ఐకూ బ్రాండ్ మంచి పేరుని తెచ్చుకుంది. వినియోగదారులు ఐకూ పట్ల నమ్మకం ఏర్పరచుకున్నారు. అన్ని సెగ్మెంట్స్ లో ఫోన్లను లాంచ్ చేస్తున్న ఈ సంస్థ తాజాగా iQOO 11 సిరీస్ లో తన మూడో ఫోన్ iQOO 11S ని చైనాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ తో పాటు iQOO TWS 1 ఇయర్ బడ్స్ కూడా లాంచ్ అయ్యాయి. ఇక iQOO 11S స్పెసిఫికేషన్స్ చూస్తే, ఈ డివైజ్ లో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ బ్రైట్నెస్, 3200*1440 పిక్సెల్ రెజుల్యూషన్ ఉన్నాయి.
iQOO 11S స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది. సరే, ఓసారి iQOO 11S పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.
iQOO 11S ధర, లభ్యత
- iQOO 11S 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర చైనాలో CNY 3799 (సుమారు రూ.43,156) గా ఉంది.
- iQOO 11S 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ యూనిట్ ధర CNY 4099 (సుమారు రూ.46,600) గా ఉంది.
- 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 4399 (సుమారు రూ.49,900) గా ఉంది.
- టాప్ మోడల్ అయిన 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 4,799 (సుమారు రూ.54,518) గా ఉంది.
- చైనాలో జులై 10 నుంచి iQOO 11S స్మార్ట్ ఫోన్ సేల్ కి అందుబాటులో ఉంటుంది.
iQOO 11S స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: iQOO 11S లో 6.78-ఇంచ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: iQOO 11S లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: iQOO 11S డివైజ్ 12జిబి + 256జిబి, 16జిబి + 256జిబి, 16జిబి + 512జిబి మరియు 16జిబి + 1టిబి వేరియంట్స్ లో లభ్యమవుతుంది.
- కెమెరా: iQOO 11S లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని వీసీఎస్ ఐఎంఎక్స్866 సెన్సర్, 13ఎంపి పొట్రెయిట్ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- ఓఎస్: iQOO 11S స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: iQOO 11S లో డ్యూయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, 5జీ, వై-ఫై 7, జీపీఎస్, బ్లూటూత్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
- కలర్ ఆప్షన్స్: iQOO 11S డివైజ్ ట్రాక్ ఎడిషన్ (వైట్), కియాన్‌టాంగ్ టింగ్‌చావో (సియన్), లెజెండరీ ఎడిషన్ (బ్లాక్) కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
iQOO 11S భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతుంది?
iQOO 11S ప్రస్తుతం చైనాలో లాంచ్ అయ్యింది. ఇంకా ఇండియా లాంచ్ కి సంబంధించిన సమాచారం బయటకు రాలేదు. త్వరలోనే దీనిపై కంపెనీ నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.











