
షావోమి సంస్థ రీసెంట్ గా గ్లోబల్ మార్కెట్ లో Xiaomi 13 Ultra స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ చైనా కంపెనీ, ప్రస్తుతం షావోమి 14 సిరీస్ స్మార్ట్ ఫోన్లపై పని చేస్తోంది. ఇటీవలె ఒక టిప్‌స్టర్ Xiaomi 13T Pro డివైజ్ ప్రధాన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశారు. అలాగే, కంపెనీ Xiaomi 13T సిరీస్ స్మార్ట్ ఫోన్ పై కూడా పని చేస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్ లో Xiaomi 13T, Xiaomi 13T Pro మోడల్స్ మార్కెట్ లోకి ప్రవేశించనున్నాయి.
నెట్టింట్లో వస్తోన్న రూమర్లను బట్టి, Xiaomi 13T సిరీస్ స్మార్ట్ ఫోన్స్ గ్లోబల్ మార్కెట్స్ లో త్వరలోనే లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రో వేరియంట్ కొన్ని రోజుల క్రితం IMEI డేటాబేస్ పై కనిపించింది. ఒక టిప్‌స్టర్ ప్రకారం, షావోమి సంస్థ Xiaomi 13T సిరీస్ ని 2023 మూడో లేదా నాల్గో త్రైమాసికంలో లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. తాజాగా Xiaomi 13T Pro డివైజ్ IMDA సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది.
లీకైన Xiaomi 13T Pro ధర
ఐఎండీఏ సర్టిఫికేషన్ ద్వారా Xiaomi 13T Pro స్మార్ట్ ఫోన్ త్వరలో గ్లోబల్ గా లాంచ్ కానుందని తెలుస్తోంది. లిస్టింగ్ లో Xiaomi 13T Pro డివైజ్ 23078PND5G అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. గతంలో ఇదే మోడల్ నంబర్ తో IMEI డేటాబేస్ లిస్టింగ్ పై కనిపించింది. ఈ డివైజ్ బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ వివరాలు లిస్టింగ్ ద్వారా తెలిసాయి.
Xiaomi 13T Pro స్మార్ట్ ఫోన్ 12జిబి + 512జిబి వేరియంట్ ధర అమెజాన్ యూకే వెబ్ సైట్ పై 799 యూరోలు (సుమారు రూ.83,400) గా ఉంది. షావోమి సంస్థ 12జిబి + 256జిబి స్టోరేజీ వేరియంట్ ని కూడా లాంచ్ చేయనుందని సమాచారం. మీడో గ్రీన్ కలర్ ఆప్షన్ లో Xiaomi 13T Pro లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇకపోతే లైకా భాగస్వామ్యం Xiaomi 13T సిరీస్ కి కూడా కొనసాగనుంది.
Xiaomi 13T Pro స్పెసిఫికేషన్స్ (లీక్)
- చిప్సెట్: Xiaomi 13T Pro డివైజ్ 4 నానోమీటర్ ప్రాసెసర్ తో రానుందని అమెజాన్ యూకే లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది. అంటే ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ లేదా మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ తో రానుందని అంచనా వేస్తున్నారు.
- డిస్ప్లే: Xiaomi 13T Pro లో క్రిస్టల్‌రెజ్ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని సమాచారం.
- ఓఎస్: Xiaomi 13T Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
- బ్యాటరీ: Xiaomi 13T Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు.
- చార్జింగ్: Xiaomi 13T Pro లో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని అందిస్తున్నారు.
- ర్యామ్, స్టోరేజీ: Xiaomi 13T Pro లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
Xiaomi 13T డివైజ్ స్పెసిఫికేషన్స్
Xiaomi 13T స్మార్ట్ ఫోన్ Xiaomi 13T Pro తో పాటు లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. స్టాండర్డ్ మోడల్ అయిన Xiaomi 13T లో మీడియాటెక్ డైమెన్సిటీ 4 ఎన్ఎం ప్రాసెసర్ ఉంటుందని సమాచారం. ఇక 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉంటాయని అంచనా వేస్తున్నారు.
Xiaomi 13T లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ 8జిబి + 256జిబి వేరియంట్ ధర 599 యూరోలు (సుమారు రూ.62,470) గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.











