హైలైట్స్:
- ఆగస్టు 2 న లాంచ్ అవుతోన్న ఐకూ 9టీ
- లాంచ్ కి ముందు రివీల్ అయిన ఐకూ 9టీ ధర, బ్యాంక్ ఆఫర్
- 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 16ఎంపి సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు

ఆగస్టు 2 న ఐకూ 9టీ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. ఇప్పుడు లాంచ్ కి ముందు భారత్ లో ఫోన్ ధర, బ్యాంక్ ఆఫర్స్ గురించి బయటకు వచ్చింది. ఎంతోమంది యూట్యూబర్లు ఐకూ 9టీ అన్ బాక్సింగ్ వీడియోలను కూడా పోస్త్ చేశారు. గతంలో కూడా ఐకూ 9టీ అన్ బాక్సింగ్ వీడియోలు వచ్చాయి. చాలామంది ఆ వీడియోలను చూసే ఉంటారు. ఇక బాక్స్ లోపల ఐకూ 9టీ ఫోన్, 120 వాట్ ఛార్జర్ అండ్ కేబుల్, సిమ్ ఎజెక్టింగ్ టూల్, ఒక కేస్, యూజర్ మాన్యువల్ ఉన్నాయి.
గతంలో చైనాలో లాంచ్ అయిన ఐకూ 10 ఫోన్, ఐకూ 9టీ రూపంలో భారత్ లో విడుదలవుతోంది. ఐకూ 9 సిరీస్ లో ఇది మూడవ ఫోన్. ఇంతకు ముందు ఐకూ 9, ఐకూ 9 ప్రో విడుదలయ్యాయి.
భారత్ లో iQOO 9T ధర, సేల్ తేదీ
ఐకూ 9టీ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది. 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.49,999 కాగా, 12జిబి+256జిబి యూనిట్ ధరను రూ.54,999 గా నిర్ణయించినట్లు సమాచారం. ఆల్ఫా, లెజెండ్ అనే రెండు రంగుల్లో ఐకూ 9టీ లభించనుంది. ఇక ఈ ఫోన్ ఆగస్టు 2 న మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు, ఐసీఐసీఐ కార్డ్స్ తో కనుక ఫోన్ ని కొంటే, రూ.4000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ఇక ఐకూ డివైజ్ ను ఎక్స్చేంజ్ చేస్తే రూ.7000 డిస్కౌంట్, ఇతర ఫోన్స్ ని ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.5000 డిస్కౌంట్ పొందుతారు. కస్టమర్లకు 12 నెలల కాల వ్యవధి గల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.
iQOO 9T స్పెసిఫికేషన్స్
ఐకూ 9టీ ఫోన్ లో 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. అలాగే ఈ ఫోన్లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ను అమర్చారు. ఇప్పుడు బ్యాటరీ విభాగం విశేషాలను చూద్దాం. 4,700ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్ లో అమర్చారు. కాగా, ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఈ ఫోన్ కలిగి ఉంది.
iQOO 9T స్పెసిఫికేషన్స్
- 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ 120 హెర్ట్జ్ డిస్ప్లే
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్
- 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ
- 4,700ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్
- 50ఎంపి + 13ఎంపి + 12ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
- 16ఎంపి సెల్ఫీ కెమెరా
- ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ ఓషన్ కస్టమ్ స్కిన్
ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఐకూ 9టీ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఒకటి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మరొకటి 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, ఇంకొకటి 12 మెగాపిక్సెల్ పోట్రెయిట్ లెన్స్. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఫోన్ ముందు వైపున 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ ఓషియన్ కస్టమ్ స్కిన్ పై ఐకూ 9టీ పని చేస్తుంది.












