భారత్ లో బ్యాన్ అయిన BGMI గేమ్

హైలైట్స్:

  • భారత్ లో రద్దైన పీయూబీజీ మరో అవతారం బీజీఎంఐ
  • క్రాఫ్టన్ సంస్థ రూపొందించిన బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) ఇకపై గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో అందుబాటులో ఉండదు
  • ప్రభుత్వ ఆజ్ఞల నేపథ్యంలో భారత్ నుంచి గేమ్ ని తొలగింపు

గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో ఇకపై బ్యాటిగ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) గేమ్ అందుబాటులో ఉండదు. ప్రభుత్వ ఆదేశంతో భారత్ నుంచి గేమ్ ని తొలగించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పీయూబీజీ మొబైల్ గేమ్ తరహాలో ఉండటం వల్లనే బీజీఎంఐ ని బ్యాన్ చేశారా? అన్న విషయం ఇంకా తెలియదు. చైనీస్ రూట్స్ కలిగిన పీయూబీజీ గేమ్ ని 2020 లో రద్దు చేసిన సంగతి తెలిసిందే. ద హిందూ ప్రచురించిన కథనాన్ని బట్టి, దేశంలో బ్యాన్ కాబడిన గేమ్స్ ఇంకా వేరే రూపాల్లో అందుబాటులోనే ఉంటున్నాయని, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభలో ఓ నివేదికను సమర్పించారు. అటువంటి యాప్స్ ని పరిశీలించాల్సిందిగా హోమ్ మంత్రిత్వశాఖకు నివేదికను పంపించినట్లు ఆయన తన రిపోర్ట్ లో పేర్కొన్నారు. పీయూబీజీ యొక్క రీబ్రాండెడ్ వర్షనే ఈ బీజీఎంఐ అన్న విషయం అందరికీ తెలిసిందే.

భారత్ లో బ్యాన్ అయిన BGMI: క్రాఫ్టన్, గూగుల్ స్టేట్మెంట్

బీజీఎంఐ బ్యాన్ పై గేమ్ ని తయారు చేసిన సంస్థ క్రాఫ్టన్ స్పందించింది. “గూగుల్ ప్లే స్టోర్ నుంచి బీజీఎంఐ ఎలా తొలగింపబడిందన్న దానిపై స్పష్టతనిస్తాం, అలాగే సరైన వివరాలను అందజేస్తాం,” అని క్రాఫ్టన్ తెలిపింది. మరోవైపు గూగుల్ స్పందిస్తూ, ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో ప్లే స్టోర్ నుంచి బీజీఎంఐ ని తొలగించామని గూగుల్ చెప్పింది. “జరగబోవు తంతు గురించి, సంబంధిత డెవలపర్ కి విషయం తెలియజేశాం, భారత్ లో ప్లేస్టోర్ లో అందుబాటులో ఉన్న యాప్ కి ఇకపై యాక్సెస్ ఉండబోదు.” అని గూగుల్ తన స్టేట్మెంట్ లో పేర్కొంది.

భారత్ లో BGMI ఎందుకు బ్యాన్ అయ్యింది?

పీయూబీజీ కి బానిసైన ఓ బాలుడు తన కన్న తల్లినే చంపేశాడన్న మీడియా కథనంతో ఇదంతా మొదలైంది. లక్నోలో ఈ ఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ళ బాలుడు పీయూబీజీ ఆడుతుండగా, తల్లి ఆపడంతో బాలుడు ఆమెను చంపేసినట్లు సమాచారం.

పార్లమెంట్ లో ఈ విషయాన్ని లేవనెత్తిన చంద్రశేఖర్, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తో ఈ ఘటనపై విచారణ చేపట్టి, నిజాలను కనిపెట్టాలన్నారు. “కానీ, ఇక్కడ విషయం ఏంటంటే, MeitY చే పీయూబీజీ గేమ్ 2020 లోనే బ్యాన్ అయ్యింది. అప్పటి నుంచి ఈ గేమ్ అందుబాటులోనే లేదు,” అని ఆయన అన్నారు.

మరి నెక్ట్స్ BGMI విషయంలో జరిగేదేంటి?

తదుపరి అప్డేట్స్ వచ్చేంత వరకు, గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో బీజీఏంఐ గేమ్ అందుబాటులో ఉండదు. అంతే యూజర్లు తమ డివైజెస్ లో ఈ గేమ్ ని డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలు లేదు. అయితే, ఇప్పటికే తమ ఫోన్స్ లో బీజీఎంఐ గేమ్ ని కలిగి ఉన్న వారు మాత్రం గేమ్ ని ఆడే వీలుంది.

ఇంకా డౌన్ లోడ్ కి అందుబాటులో ఉన్న PUBG New State

ఓవైపు మార్కెట్ ప్లేస్ నుంచి బీజీఎంఐ ని తొలగించినప్పటికీ, క్రాఫ్టన్ తయరు చేసిన కొత్తతరం గేమ్ పీయూబీజీ న్యూ స్టేట్ ఇంకా అందుబాటులోనే ఉంది. ఈ గేమ్ ని గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇక పీయూబీజీ న్యూ స్టేట్ విషయానికి వస్తే, ఈ గేమ్ కూడా బీజీఎంఐ లాంటి అనుభూతినే ఇస్తుంది. అయితే ఇందులో ఇంకా బెటర్ గ్రాఫిక్స్ ఉంటాయి. మరో విషయం ఏంటంటే, ఈ గేమ్ కొన్ని డివైజెస్ కి మాత్రమే పరిమితం. ఈ గేమ్ డౌన్ లోడ్ చేసుకోవాలంటే, మీ వద్ద 4జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 6 ఓఎస్ లేదా ఆపైన ఓఎస్ కలిగిన డివైజ్ ఉండాలి. అలాగే ఐఫోన్ ఐవోఎస్ 13 లేదా ఆపైన ఓఎస్ కలిగిన ఫోన్ మీ వద్ద ఉండాలి.

Previous article777 చార్లీ: Voot ఓటీటీ సైట్ లో రేపే ప్రీమియర్ షో
Next articleలాంచ్ కి ముందు లీకైన iQOO 9T ధర, బ్యాంక్ ఆఫర్లు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.